Hyderabad: హైదరాబాద్‌లో మరో హవాలా రాకెట్‌ గుట్టురట్టు.. భారీగా నగదు స్వాధీనం.. కస్టమర్‌కు డబ్బు ఇచ్చేందుకు వెళ్తుండగా..

హైదరాబాద్‌లో మరోసారి భారీగా డబ్బు దొరికింది. నారాయణగూడలో కోటి 27 లక్షల రూపాయలను హైదరాబాద్ అధికారులు సీజ్‌ చేశారు. ఆ సొమ్ము హవాలా డబ్బుగా నిర్ధారించారు సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.

Hyderabad: హైదరాబాద్‌లో మరో హవాలా రాకెట్‌ గుట్టురట్టు.. భారీగా నగదు స్వాధీనం.. కస్టమర్‌కు డబ్బు ఇచ్చేందుకు వెళ్తుండగా..
Money In Account

Updated on: Nov 02, 2022 | 8:30 PM

హైదరాబాద్‌లో మరోసారి భారీగా డబ్బు దొరికింది. నారాయణగూడలో కోటి 27 లక్షల రూపాయలను హైదరాబాద్ అధికారులు సీజ్‌ చేశారు. ఆ సొమ్ము హవాలా డబ్బుగా నిర్ధారించారు హైదరాబాద్ సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. ఈ కేసులో శ్రీనివాస్, విశ్వనాథ్ అనే ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. మన్నె శ్రీనివాస్‌ అనే వ్యక్తి నుంచి రూ.70లక్షలు.. విశ్వనాథ్‌ చెట్టి నుంచి 57లక్షలు నిందితులు సేకరించారు. కవాడిగూడలో తమకు తెలియని కస్టమర్‌కు ఆ డబ్బును డెలివరీ చేసేందుకు తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు.

మన్నె శ్రీనివాస్ దగ్గర కలెక్షన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నట్టు నిందితులు చెప్పారు. హవాలా పద్ధతిలో సొమ్ము ఎన్నాళ్లుగా తరలించారు.. ఎంత మొత్తం డబ్బు చేతులు మారిందనే కోణంలో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ నగర్ వద్ద ద్విచక్ర వాహనంలో పోలీసులు నగదును గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.

మన్నె శ్రీనివాస్ అలియాస్ శ్రీను అనే వ్యక్తి వద్ద కలెక్షన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నామని నిందితులు పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై లోతుగా విచారిస్తున్నరట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..