Weather Report: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. మంగళవారం వెదర్ రిపోర్ట్ ఇదిగో..
బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్, మరో 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలోనూ మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు నమోదయ్యే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు, మంగళవారం పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలకు వర్ష సూచనలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో వానలు పడే ఛాన్స్ ఉందని.. వచ్చే రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో భారీ వర్షాలు..
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24గంటల్లో జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావారణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని.. వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. .. పెద్దపల్లి, కరీంనగర్, మెదక్, మల్కాజ్‌గిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా.. సంగారెడ్డి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు సైతం వర్ష సూచన చేసింది. 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.
ఏపీలో రాబోయే రెండు రోజులకు వర్ష హెచ్చరిక:
ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ పేర్కొంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల వాయు ప్రసరణ ప్రభావం కారణంగా, రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు (ఉరుములు, మెరుపులతో) కురుస్తాయని పేర్కొంది. కోస్తా జిల్లాలలతోపాటు.. నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతితోపాటు.. మిగిలిన జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని తెలిపింది.
మెరుపులు, ఈదురు గాలుల సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడవద్దని, పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండి, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
