Samantha: మంత్రి కేటీఆర్‌పై ప్రశంసలు కురిపించిన నటి సమంత.. గర్వంగా ఉందంటూ ట్వీట్..
Samantha: సోషల్ మీడియాలో (Social Media) నిత్యం యాక్టివ్‌గా ఉండే నటీమణుల్లో సమంత ఒకరు. కేవలం సినిమాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలే కాకుండా సమాజంలో జరిగే అంశాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తుంటారు సామ్...

Samantha: సోషల్ మీడియాలో (Social Media) నిత్యం యాక్టివ్‌గా ఉండే నటీమణుల్లో సమంత ఒకరు. కేవలం సినిమాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలే కాకుండా సమాజంలో జరిగే అంశాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తుంటారు సామ్. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై (KTR) సమంత ప్రశంసలు కురిపించారు. చాలా గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు. ఇంతకీ కేటీఆర్‌ను సమంత ఎందుకు పొగిడిందనేగా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రం ‘టీ–హబ్’రెండో దశలో భాగంగా రాయదుర్గంలో టీహబ్ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిర్మాణాన్ని జూన్ 28న ప్రారంభించనున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని తెలుపుతూ మంత్రి కేటీఆర్ ఆదివారం ట్వీట్ చేశారు. రాయదుర్గంలో ఏర్పాటు చేసిన టీహబ్ భవనానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన మంత్రి.. ‘టీ హబ్ హైదరాబాద్ ప్రారంభంతో తెలంగాణలో ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్‌కు పునరుజ్జీవం రానుందని. ఈ రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు రానున్నాయి’ అని మంత్రి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ చెప్పిన.. ‘భవిష్యత్తు ఊహించుకోవడం అంటే దానిని సృష్టించుకోవడమే ఉత్తమమైన మార్గం’ అనే కొటేషన్ ప్రస్తావించారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన నటి సమంత.. ‘హ్యాపెనింగ్ హైదరాబాద్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో పాటు చాలా గర్వంగా ఉంది అంటూ కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు.
సమంత చేసిన ట్వీట్…
#HappeningHyderabad So proud ?@KTRTRS https://t.co/8i3U5G8jR9
— Samantha (@Samanthaprabhu2) June 26, 2022
ఇదిలా ఉంటే టీ హబ్-2ను తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో 5.82 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దారు. 2015లో గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో టెక్నాలజీ హబ్ (టీ హబ్)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రారంభిస్తున్న టీ హబ్-2లో ఒకేసారి 2 వేలకుపైగా స్టార్టప్‌లు తమ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు వీలుగా అన్నిరకాల మౌలిక వసతులు కల్పించనున్నారు. రాష్ట్ర ఇన్నోవేషన్ ఎకోసిస్టంలో భాగమైన టీహబ్, తెలంగాణ డేటా సెంటర్‌ను ఇటీవల సందర్శించి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..