AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఈ ప్రాంతాల్లో భూములు కొంటే జాక్‌పాట్‌ కొట్టేసినట్లే.. లాభాలే లాభాలు..

మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మొన్నటి మొన్న కోకాపేట్‌లో ఎకరం రూ. వంద కోట్లకు అమ్ముడుపోయి ప్రపంచాన్నే విస్మయానికి గురి చేసింది. దేశంలో ఒక ఎకరం ఇంత మొత్తానికి అమ్ముడుపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతేకాకుండా హైదరాబాద్‌కు నలుమూలల భూముల ధరలకు రెక్కలొచ్చాయి. విదేశీ పెట్టుబడి దారులు, మరీ ముఖ్యంగా తెలుగు...

Hyderabad: ఈ ప్రాంతాల్లో భూములు కొంటే జాక్‌పాట్‌ కొట్టేసినట్లే.. లాభాలే లాభాలు..
Hyderabad Real Estate
Narender Vaitla
|

Updated on: Oct 27, 2023 | 8:04 AM

Share

భూమిపై పెట్టుబడి పెట్టిన వారు ఎప్పటికీ నష్టపోరు అనే ఒక నానుడి ఉంది. జనాభా రోజురోజుకీ పెరుగుతుంది కానీ పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా భూమి మాత్రం పెరగదు అనేది అక్షర సత్యం. అందుకే భూమికి ఉన్న విలువ మరేదానిఇక ఉండదని చెబుతుంటారు. రియల్ ఎస్టేట్‌ రంగం ఓ రేంజ్‌లో అభివృద్ధి చెందుతుండడానికి ఇదే ప్రధాన కారణం.

మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మొన్నటి మొన్న కోకాపేట్‌లో ఎకరం రూ. వంద కోట్లకు అమ్ముడుపోయి ప్రపంచాన్నే విస్మయానికి గురి చేసింది. దేశంలో ఒక ఎకరం ఇంత మొత్తానికి అమ్ముడుపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతేకాకుండా హైదరాబాద్‌కు నలుమూలల భూముల ధరలకు రెక్కలొచ్చాయి. విదేశీ పెట్టుబడి దారులు, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడుతుండడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు.

కొలియర్స్ ఇండియా అనే సంస్థ.. ఇటీవల భారత్‌లో భూముల కొనుగోళ్లలో అగ్ర స్థానంలో ఉన్న పట్టణాల జాబితాను విడుదల చేసింది. ఇందులో టాప్‌ 5 కారిడార్లలో హైదరాబాద్‌ కూడా చోటు దక్కించుకోవడం విశేషం. భారత్‌లో భూములపై పెట్టుబడులు పెట్టడానికి అనువైన నగరాల్లో హైదరాబాద్‌ ఒకటని ఈ సంస్థ తెలిపింది. కొలియర్స్‌ ఇండియా విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం.. హైదరాబాద్‌లోని మేడ్చల్‌, కొంపల్లి, శామీర్‌పేట్‌ ప్రాంతాలు పెట్టుబడులకు అనువైన ప్రాంతాలుగా తెలిపింది. ఈ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసిన వారికి భవిష్యత్తులో ఢోకా ఉండదని తెలిపింది.

హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో భూములపై పుట్టుబడులు పెట్టిన వారికి వచ్చే పదేళ్లలో మూడు రెట్లు రిటర్న్స్ పొందొచ్చని కొలియర్స్‌ ఇండియా నివేదిక అంచనా వేసింది. హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్రలోని నేరల్‌, మాతేరన్, గుజరాత్‌లోని సనంద్‌, నల్‌సరోవర్‌ భూములు పెట్టుబడులకు టాప్‌-5 కారిడార్లుగా కొలియర్స్‌ ఇండియా తెలిపింది. ఈ ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టిన వారికి కూడా మంచి లాభాలు ఖాయమని కొలియర్స్‌ ఇండియా తన నివేదికలో పేర్కొంది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..