AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కూకట్‌పల్లిలో తీవ్ర విషాదం.. కల్తీ కల్లు తాగి 11 మందికి అస్వస్థత, ఒకరి పరిస్థితి విషమం!

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. కూకట్‌పల్లిలోని హైదర్ నగర్‌లో కల్లు తాగిన పలువురు అస్వస్థతకు గురయ్యారు. స్థానికంగా ఉన్న ఓ కల్లు దుకాణంలో మంగళవారం కల్లు తాగిన 11 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అందుకొ ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

Hyderabad: కూకట్‌పల్లిలో తీవ్ర విషాదం.. కల్తీ కల్లు తాగి 11 మందికి అస్వస్థత, ఒకరి పరిస్థితి విషమం!
Adulterated Toddy
Anand T
|

Updated on: Jul 08, 2025 | 11:51 PM

Share

డబ్బుల కోసం కొందరు వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. పౌడర్, కెమికల్స్‌తో తయారు చేసిన కల్లును దుకాణాల్లో విక్రయిస్తున్న ప్రజల శరీరాల్లో విషాన్ని నింపుతున్నారు. రాష్ట్రంలో ఎక్సైజ్‌ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్న కల్తీ కల్లు మాఫియాలో మాత్రం ఎటువంటి మార్పు ఉండట్లేదు. దుకాణాల్లో విచ్చలవిడిగా కల్తీ దందాను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లో మరోసారి కల్తీ కల్లు వ్యవహారం వెలుగు చూసింది. కూకట్‌పల్లి పీఎస్‌ పరిధిలోని హైదర్‌నగర్‌లో కల్తీ కల్లు తాగి 11 మంది అస్వస్థతకు గురయ్యారు. కల్లు తాగిన వారు కాసేపటికే వాంతులు, విరేచనాలు, తీవ్ర కడుపునొప్పితో ఇబ్బంది పడ్డారు. దీంతో వారిని వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఒక పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు సమాచారం

కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురైనట్టు సదరు హాస్పిటల్ సిబ్బంది జీహెచ్‌ఎంసీ, ఎంహెచ్‌వోకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే, అరికెపూడి గాంధీ, బీఆర్‌ ఎస్‌ ఎమ్యెల్యే మాధవరం కృష్ణారావు బాధితులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కల్తీ కల్లు తయారీ దారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో కూకట్‌పల్లి పోలీసులు బాధితులను నుంచి వివరాలు సేకరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పాలు తాగి.. రోజుకు 90 కిలోల బరువు పెరుగుతుంది!
పాలు తాగి.. రోజుకు 90 కిలోల బరువు పెరుగుతుంది!
మీరు కొన్న పనీర్ స్వచ్ఛమైందేనా.. ఈ 5 చిట్కాలతో ఈజీగా తెలుసుకోండి
మీరు కొన్న పనీర్ స్వచ్ఛమైందేనా.. ఈ 5 చిట్కాలతో ఈజీగా తెలుసుకోండి
కామికా ఏకాదశి ఎప్పుడు? ఈ వస్తువులు దానం చేస్తే ఐశ్వర్యం, శుభ..
కామికా ఏకాదశి ఎప్పుడు? ఈ వస్తువులు దానం చేస్తే ఐశ్వర్యం, శుభ..
ద్రవిడ్‌లాగే రహానేకు పెద్దగా గుర్తింపు దక్కలేదు: సునీల్ గవాస్కర్
ద్రవిడ్‌లాగే రహానేకు పెద్దగా గుర్తింపు దక్కలేదు: సునీల్ గవాస్కర్
నేతలే కాదు.. ఇప్పుడు వారసులూ!
నేతలే కాదు.. ఇప్పుడు వారసులూ!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లల్లో ప్రత్యేక రైళ్లు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లల్లో ప్రత్యేక రైళ్లు
అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్!
అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్!
ధోని ఎలాంటోడంటే.. రిటైర్మెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన రహానె
ధోని ఎలాంటోడంటే.. రిటైర్మెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన రహానె
శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే..
శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే..
స్నేహితుడు శత్రువైతే ఒక్క పని చేయండి.. ప్రేమానంద మహారాజ్ సలహా..
స్నేహితుడు శత్రువైతే ఒక్క పని చేయండి.. ప్రేమానంద మహారాజ్ సలహా..