Miss World 2025: చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ నిర్వహించనున్న 109 దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్..

శనివారం హైదరాబాద్ లో జరిగిన మిస్ వరల్డ్ 2025 ప్రారంభోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పోటీల్లో 120కు దేశాలకు పైగా దేశాల సుందరాంగులు పాల్గొన్నారు. ఇక ఇప్పుడు మంగళవారం నాడు 109 దేశాల కంటెస్టంట్లు ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్ వద్ద హెరిటేజ్ వాకింగ్ వహిస్తారు.

Miss World 2025: చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ నిర్వహించనున్న 109 దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్..
Miss World

Edited By: Rajitha Chanti

Updated on: May 12, 2025 | 10:06 PM

మిస్ వరల్డ్ లో పాల్గొనడానికి వచ్చిన 109 దేశాల కంటెస్టెంట్స్ మంగళవారం నాడు ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్ వద్ద హెరిటేజ్ వాకింగ్ వహిస్తారు. దాదాపు నాలుగు ప్రత్యేక బస్సుల్లో చార్మినార్ వద్దకు చేరుకునే 109 దేశాల సుందరిమణులకు పాత బస్తీలో పాపులర్ అయిన మార్ఫా వాయిద్యాలతో స్వాగతం పలుకుతారు. చార్మినార్ వద్ద ప్రత్యేకంగా ఫోటోషూట్ నిర్వహిస్తారు. అనంతరం చార్మినార్ సమీపంలోని చుడీ బజారులో ఎంపిక చేసిన తొమ్మిది దుకాణాల్లో వివిధ రకాల గాజులు, ముత్యాల హారాలు తదితర అలంకరణ వస్తువుల షాపింగ్ నిర్వహిస్తారు. హైదరాబాద్ బ్యాంగిల్స్, ముజీబ్ బ్యాంగిల్స్, కనహయ్యలాల్, మోతిలాల్ కర్వా, గోకుల్ దాస్ జరీవాల, కె ఆర్ కాసత్, జాజు పెరల్స్ ఏ హెచ్ జరీవాల, అఫ్జల్ మియా కర్చోబే వాలే దుకాణాల్లో షాపింగ్ నిర్వహిస్తారు.

గాజులు తయారు చేసే విధానాన్ని స్వయంగా పరిశీలిస్తారు, అనంతరం సుప్రసిద్ధ చౌహన్లా ప్యాలెస్ లో ఏర్పాటుచేసే విందుకు హాజరవుతారు. మిస్ వరల్డ్ కంటెస్టంట్లకు మెహేంది వేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అదేవిధంగా నిజామి సాంప్రదాయ దుస్తులను కూడా దరించడానికి ఏర్పాటు చేశారు. దీనితోపాటు రాష్ట్రంలో వివిధ పర్యాటక ప్రాంతాల విశిష్టతను తెలిపే సినిమాలను ప్రదర్శిస్తారు.

చౌహన్లా ప్యాలెస్ లో నిజాం హ ప్రోగ్రాంహయంలో ఉపయోగించిన యుద్ధ ఆయుధాలు, గృహోపకరణ సామాగ్రి, నిజాం నవాబులు ఉపయోగించిన వివిధ రకాల వస్తువులు, ఓల్డ్ సిటీ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే ఫోటో ప్రదర్శనలు మిస్ వరల్డ్ కంటెస్టర్లు తిలకిస్తారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు విస్తృత ఏర్పాట్లను చేశారు.

ఇవి కూడా చదవండి :  

 Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?

Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..