Hyderabad: శీతాకాలంలో సౌందర్య ఉత్పత్తులకు పెరిగిన డిమాండ్.. కారణం ఇదే

| Edited By: Srilakshmi C

Dec 15, 2023 | 2:55 PM

హైదరాబాద్‌లో వింటర్ సీజన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. కనిష్ట ఊష్ణోగ్రతలు సాధరణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. చలిని తట్టుకునేందుకు ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వింటర్‌లో స్కిన్ డ్రై అవ్వడం, హెయిర్ ఫాల్ తోఇబ్బందులు పడుతుంటారు. దీనికి తోడు సిటీలో పొల్యూషన్ తో అందం మీద ప్రతి ఒక్కరు శ్రద్ధ పెడుతున్నారు. మరో పక్క సీజన్ కు తగ్గట్టుగా మార్కెట్ లో స్కిన్ అండ్ హెయిర్ కేర్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. రాష్ట్రంలో చలి ప్రభావం పెరిగింది. హైదరాబాద్‌లో రోజు రోజుకు టెంపరేచర్స్..

Hyderabad: శీతాకాలంలో సౌందర్య ఉత్పత్తులకు పెరిగిన డిమాండ్.. కారణం ఇదే
Skincare Products
Follow us on

హైదరాబాద్‌, డిసెంబర్‌ 15: హైదరాబాద్‌లో వింటర్ సీజన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. కనిష్ట ఊష్ణోగ్రతలు సాధరణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. చలిని తట్టుకునేందుకు ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వింటర్‌లో స్కిన్ డ్రై అవ్వడం, హెయిర్ ఫాల్ తోఇబ్బందులు పడుతుంటారు. దీనికి తోడు సిటీలో పొల్యూషన్ తో అందం మీద ప్రతి ఒక్కరు శ్రద్ధ పెడుతున్నారు. మరో పక్క సీజన్ కు తగ్గట్టుగా మార్కెట్ లో స్కిన్ అండ్ హెయిర్ కేర్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. రాష్ట్రంలో చలి ప్రభావం పెరిగింది. హైదరాబాద్‌లో రోజు రోజుకు టెంపరేచర్స్ పడిపోతున్నాయి. మారుతున్న వెదర్ కు తగ్గట్టుగా బ్యూటీ పై ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటి జనరేషన్ యూత్. సిటీలో చలి పెరగడం తో స్కిన్ కేర్ కోసం రకరకాల ఉత్పత్తులను కొంటున్నారు. దీనితో కాస్మోటిక్ షో రూమ్స్ పబ్లిక్ తో రష్ గా మారాయి. వింటర్ స్పెషల్ స్కిన్ కేర్ నుంచి మేకప్ ప్రాడక్ట్స్ వరకు డిమాండ్ పెరిగింది. ప్రతి ఒకరు స్కిన్స్ డ్రై అవడం, క్రాకర్స్ రాకుండా ఉండేందుకు బాడీ లోషన్స్, బాడీ బటర్స్, లిప్ బామ్స్, స్కిన్ స్క్రాబ్ర్స్ కొనుగోలు చేస్తున్నట్టు చెబుతున్నారు పబ్లిక్.

ప్రతి ఏటా అందం కోసం వేలల్లో ఖర్చు చేసే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. ఒకప్పటితో పోల్చితే మంథ్లీ స్కిన్ కేర్ కోసం మినిమమ్ రూ.5వేల దారా అమ్మాయిలు ఖర్చు చేస్తునారు. ఇక సీజన్ మారితే ఆ కాలానికి తగ్గట్టుగా హెయిర్ ట్రీట్మెంట్స్, స్కిన్ కేర్ ప్రాడక్ట్స్ ను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా డ్రై స్కిన్ అవ్వకుండా ఉండేందుకు ఇటు బ్యూటీ బ్రాండ్స్ కూడా కొత్త ఉత్పత్తులను రిలీజ్ చేస్తున్నారు. వింటర్ సీజన్ లో 6 టూ 8 అవర్స్ స్కిన్ మాయిశ్చరైజర్స్ స్టే ఉండేయ్ ఉత్పత్తుల సేల్స్ బాగున్నాయంటున్నారు వ్యాపారులు. అందులోను పబ్లిక్ హెర్బల్, వీగన్ కాస్మోటిక్స్, సీరమ్స్, బాడీ ఆయిల్స్ ను ఎక్కువగా ఇష్టపడుతున్నట్టు చెబుతున్నారు పబ్లిక్. అందులోనూ లోకల్ ప్రాడక్ట్స్ కంటే ఇంటర్నేష్నల్ బ్రాండ్స్ క్వాలిటి ఉంటాయంటున్నారు. ధర ఎక్కువ అయినా.. మంచి రిజల్ట్స్ ఉంటే చాలు అంటున్నారు.

వింటర్‌లో ఎక్కువగా చర్మం పొడిబారడం, పెదాలు క్రాక్స్ రావడం, హిల్ క్రాక్స్, హెయిర్ ఫాల్, హెయిర్ స్ప్లిట్స్ రావడం, వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఈ సీజన్ లో ఎక్కువగా చలి కారణంగా వాటర్ ఇన్ టేక్ లేకపోవడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయంటున్నారు స్కిన్ స్పెషలిస్ట్ లు. అయితే రెగ్యులర్ గా స్కిన్ కు మాయిశ్చరైజర్లు, బాడీ ఆయిల్స్ రాసుకోవడం, ఫేస్ కోసం డెడ్ స్కిన్ కేర్ కోసం ఫుడ్ కూడా ఇంపార్టెంట్ అంటున్నారు. రెగ్యులర్ గా డైలీ వాటర్ 4 టూ 6 లీటర్స్ తాగితే చాలా మంచి అంటున్నారు. ఈ సీజన్ లో స్వెట్ వచ్చేలా ఎక్సర్ సైజ్ లు చేయాలంటున్నారు. ఇక ఫుడ్ విషయంలో ప్రూట్స్, మినరల్స్ ఉన్న లిక్విడ్స్ ను తీసుకోవడం బెటర్. అయితే రెగ్యులర్ సీజన్స్ కంటే కూడా ఈ వింటర్ లో మేకప్ ప్రాడక్ట్స్ లో క్రిమీ బేస్డ్, మాయిశ్యర్ బేస్డ్ ఉత్పత్తులు వాడాలంటున్నారు. వెడ్డింగ్ సీజన్ కావడంతో మేకప్స్,లిప్టిక్స్ లో కూడా మాయిశ్చర్కంటెంట్ ఉండేవి సేల్ బాగున్నయంటున్నారు మేకప్ ఆర్టిస్ట్ లు.

ఇవి కూడా చదవండి

కనిష్ట ఊష్ణోగ్రతలు పెరుగుతుండటంతో రానున్న జనవరి లో చలితీవ్రత తో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు స్కిన్ స్పెషలిస్ట్ లు. ఇక చలికాలంలో ఎండలో ఎక్కువ సేపు ఉండకూడదని.. ఉదయం పూట వచ్చే సన్ రేస్ బాడీకీ డీ విటమిన్ అందుతుందని నిపుణులు అంటున్నారు. చర్మాన్ని మాత్రం ఈ నాలుగు నెలలు తేమ ఉండేలా చూసుకోవాలింటున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, సీనియర్ సిటిజన్స్ ను వింటర్‌లో జాగ్రత్తలు తప్పనిసరిగా ఫాలో అవ్వాలంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.