AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: తెలంగాణ లోక్‎సభ ఎన్నికల్లో పొత్తులపై కిషన్ రెడ్డి క్లారిటీ.. పార్టీ నేతలతో ఏమన్నారంటే..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తరువాత రాజకీయ పార్టీల మధ్య వాగ్వాదాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలపై దృష్టి పెడుతున్నారు నాయకులు. ఇందులో భాగంగా పొత్తులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాక్యలు చేశారు. బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఇందులో వివిధ జిల్లాలకు చెందిన ఇంచార్జ్ లు పాల్గొన్నారు.

Kishan Reddy: తెలంగాణ లోక్‎సభ ఎన్నికల్లో పొత్తులపై కిషన్ రెడ్డి క్లారిటీ.. పార్టీ నేతలతో ఏమన్నారంటే..
Union Minister Kishan Reddy
Srikar T
|

Updated on: Dec 15, 2023 | 1:53 PM

Share

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తరువాత రాజకీయ పార్టీల మధ్య వాగ్వాదాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలపై దృష్టి పెడుతున్నారు నాయకులు. ఇందులో భాగంగా పొత్తులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాక్యలు చేశారు. బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఇందులో వివిధ జిల్లాలకు చెందిన ఇంచార్జ్ లు పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గతం కంటే మెరుగైన స్థానాలను గెలుచుకుంది బీజేపీ. ఇదే జోష్ కొనసాగిస్తూ లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని క్యాడర్ కు దిశా నిర్థేశం చేస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది అన్న వార్తలు పూర్తి అవాస్తవం అని తేల్చి చెప్పారు.

డిశంబర్ చివరి వారంలో తెలంగాణలకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా వస్తున్నట్లు తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు ఉంటుంన్నారు. అయితే అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, ఇప్పటి నుంచే దానికి అవసరమైన కసరత్తులు క్రిందిస్థాయి నుంచి ఏర్పాటు చేసుకోవాలన్నారు. తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశం ఉందని దానిని అందిపుచ్చుకోవాలని చెప్పారు. సర్వే సంస్థలకు సైతం అందని విధంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఉంటాయన్నారు.

రేపటి నుంచి భారత్ వికసిత్ యాత్ర తెలంగాణలో ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలు అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారన్నారు. కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించిన అన్ని కమిటీల నియామకాలను పూర్తి చేయాలని జిల్లా స్థాయి నాయకులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బంగారం ధరలు మరోసారి ఢమాల్.. నేటి రేట్లు ఇవే..
బంగారం ధరలు మరోసారి ఢమాల్.. నేటి రేట్లు ఇవే..
IND vs PAK: ఒకట్రెండు కాదు.. ఏకంగా 3 మ్యాచ్‌‌ల్లో భారత్, పాక్ ఢీ
IND vs PAK: ఒకట్రెండు కాదు.. ఏకంగా 3 మ్యాచ్‌‌ల్లో భారత్, పాక్ ఢీ
విశ్వవిఖ్యాత జగన్నాథ రథయాత్ర నేడు మహా వైభవంగా ప్రారంభం.. రవి యోగం
విశ్వవిఖ్యాత జగన్నాథ రథయాత్ర నేడు మహా వైభవంగా ప్రారంభం.. రవి యోగం
5 ఏళ్ల క్రితమే ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ఫలితంపై జోస్యం..
5 ఏళ్ల క్రితమే ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ఫలితంపై జోస్యం..
తమకు స్వాతంత్ర్య దొరికిందంటూ బలూచ్‌ల ప్రకటన! పాక్, చైనాకు..
తమకు స్వాతంత్ర్య దొరికిందంటూ బలూచ్‌ల ప్రకటన! పాక్, చైనాకు..
రూ.400 చెల్లిస్తే చాలు.. ఆన్‌లిమిటెడ్ వైఫై ఫ్రీ..
రూ.400 చెల్లిస్తే చాలు.. ఆన్‌లిమిటెడ్ వైఫై ఫ్రీ..
భర్తను గుడికి తీసుకెళ్లింది.. బాయ్ ఫ్రెండ్‌తో కలిపి లేపేసింది..
భర్తను గుడికి తీసుకెళ్లింది.. బాయ్ ఫ్రెండ్‌తో కలిపి లేపేసింది..
నమ్మక ద్రోహానికి బుద్ధితో సమాధానం.. కోతి- మొసలి నీతి కథ
నమ్మక ద్రోహానికి బుద్ధితో సమాధానం.. కోతి- మొసలి నీతి కథ
మీ పేరుపై ఎవరైనా లోన్ తీసుకున్నారా..? ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి
మీ పేరుపై ఎవరైనా లోన్ తీసుకున్నారా..? ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి
జగన్నాథ రథయాత్రలో ఈ విశేషం తెలుసా? గర్భగుడిలోని మూల విరాట్టులే..
జగన్నాథ రథయాత్రలో ఈ విశేషం తెలుసా? గర్భగుడిలోని మూల విరాట్టులే..