ఇటీవలి కాలంలో ఆత్మహత్యల సంఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. చిన్న చిన్న కారణాలకే యువతీ యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. విద్యార్థులు సైతం పరీక్షల ఒత్తిడి, ఫలితాల వెల్లడితో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుంటున్న ఘటనలు వారి తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
దుబాయ్‌కి వెళ్లినప్పటి నుంచి భర్త తనతో సరిగ్గా మాట్లాడడం లేదని తీవ్ర మనస్తాపం చెందిన భార్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఫలక్‌నుమా ఇన్స్పెక్టర్ దేవేందర్తెలిపిన వివరాల ప్రకారం… హజీరాబేగం(21), అస్లాం హుస్సేన్దంపతులు. వీరికి ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. వారం రోజుల క్రితం భర్త అస్లాం హుస్సేన్ దుబాయ్‌కి వెళ్లాడు. దుబాయ్‌కి వెళ్లినప్పటి నుంచి భర్త సరిగా ఫోన్మాట్లాడటం లేదని తన తల్లికి హజీరాబేగం చెప్పి బాధపడేది. దీంతో నా జీవితం నాశనమయ్యిందని తల్లికి ఫోన్ చేసి రోధించేది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి చెందిన హజీరాబేగం ఆదివారం ఉదయం చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా గమనించిన కుటుంబసభ్యులు ఫలక్‌నుమా పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న ఫలక్‌నుమా పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ కేసును ఫలక్‌నుమా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి