Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇక కేవలం రూ.99కే.. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు బస్ జర్నీ!

రాష్ట్ర ప్రయాణికులకు ఫ్లిక్స్‌ బస్‌ సర్వీసెస్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇకపై రూ.99కే హైదరాబాద్ నుండి విజయవాడకు ఐదు గంటల్లో గమ్యస్థానానికి చేర్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు తాజాగా ఈ బస్సులను తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ లాంచ్‌ చేశారు కూడా. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) బస్సులకు ప్రారంభ ప్రమోషనల్ కింద ఛార్జీ కేవలం రూ.99గా నిర్ణయించింది. ఈ బస్సుల్లో అన్ని ప్రభుత్వ పథకాలు కూడా వర్తిస్తాయట..

Telangana: ఇక కేవలం రూ.99కే.. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు బస్ జర్నీ!
EV Buses
Follow us
Ashok Bheemanapalli

| Edited By: Srilakshmi C

Updated on: Feb 07, 2025 | 8:13 PM

హైదరాబాద్‌-విజయవాడ మధ్య ప్యాసింజర్ రష్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉభయ రాష్ట్రాలు బస్సుల సంఖ్య పెంచినప్పటికీ.. రద్దీ అలాగే కొనసాగుతుంది. ఇక ఈ మధ్య కాలంలో తెలంగాణ సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. పలు ప్రవేట్ సంస్థలు సైతం ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. తాజాగా ఫ్లిక్స్‌ ఈవీ బస్సుల్ని తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ జెండా ఊపి స్టార్ట్ చేశారు. హైదరాబాద్‌-విజయవాడ మధ్య ఈ బస్సుల సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఈటీవో మోటార్స్‌తో కలిసి ఫ్లిక్స్‌ బస్‌ ఇండియా ఈ బస్సులు అందుబాటులోకి తెచ్చింది. కాగా తెలంగాణ సర్కార్ ఈవీలను ఎంకరేజ్ చేస్తుందని మంత్రి ప్రభాకర్ చెప్పారు.‌ ప్రతి వాహనం ఈవీ ఉండాలనేది సీఎం రేవంత్ ఆలోచన అన్నారు. ఈవీలతో వాయు కాలుష్యాన్ని నియంత్రించడం సాధ్యమవుతుందన్నారు.

తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెంచడం కోసం కొత్త విధానాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు మంత్రి పొన్నం. నగరంలోని ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రయత్నంలో ఉన్నామని.. ఇతర వాహనాలను కూడా ఎలక్ట్రిక్‌లోకి మార్చేందుకు ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. హైదరాబాద్‌-విజయవాడ మధ్య ఈవీ బస్సులు మూడు, నాలుగు వారాల తర్వాత అందుబాటులో ఉంటాయని ఫ్లిక్స్‌ బస్‌ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఆ తర్వాత విజయవాడ-వైజాగ్ మధ్య కూడా సర్వీసులు అందుబాటులోకి తెస్తామన్నారు. అంతేకాదు సర్వీసులు స్టార్ట్ అయ్యాక.. నాలుగు వారాల పాటు రూ.99తో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ప్రయాణించే సౌలభ్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఐదు గంటల్లో బస్సులు గమ్యానికి చేరుకుంటాయని.. అన్ని ప్రభుత్వ పథకాలు తమ బస్సుల్లోనూ వర్తిస్తాయని వివరించారు. ఈ బస్సుల్లో 49 మంది ప్రయాణం చేయొచ్చని.. మున్ముందు స్లీపర్‌ కోచ్‌లతో కూడా బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.