Hyderabad: ఏం నాయనా గన్ లైసెన్స్ కావాలా.. అయితే కంప్యూటర్స్ బాగు చేయించు.. అడ్డంగా బుక్కైన సీఐ..

| Edited By: Shiva Prajapati

Jul 19, 2023 | 10:06 AM

రవి అనే వ్యక్తికి గన్ లైసెన్స్ కావాలి.. అది కూడా రెన్యూవల్ మాత్రమే చేయించాలి. ప్రొసీజర్ ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాడు రవి.అక్కడున్న సిబ్బందిని సీఐ ఉన్నాడా అని అడిగాడు.హా వెళ్ళండి సర్ అంటూ సీఐ ఛాంబర్ కు రవి నీ పంపారు.. లోపలికి వెళ్ళగానే సీఐ శ్రవణ్ ను కలిశాడు రవి. సార్ నాకు గన్ లైసెన్స్ వ్యాలిడిటీ ఐపోయింది

Hyderabad: ఏం నాయనా గన్ లైసెన్స్ కావాలా.. అయితే కంప్యూటర్స్ బాగు చేయించు.. అడ్డంగా బుక్కైన సీఐ..
Telangana Police
Follow us on

రవి అనే వ్యక్తికి గన్ లైసెన్స్ కావాలి.. అది కూడా రెన్యూవల్ మాత్రమే చేయించాలి. ప్రొసీజర్ ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాడు రవి.అక్కడున్న సిబ్బందిని సీఐ ఉన్నాడా అని అడిగాడు.హా వెళ్ళండి సర్ అంటూ సీఐ ఛాంబర్ కు రవి నీ పంపారు.. లోపలికి వెళ్ళగానే సీఐ శ్రవణ్ ను కలిశాడు రవి. సార్ నాకు గన్ లైసెన్స్ వ్యాలిడిటీ ఐపోయింది రినివల్ చేయించాలి కొంచెం హెల్ప్ చేయండి అన్నాడు రవి. దానిదేముంది చేసేద్దాం అంటూ ఒకే చెప్పాడు సీఐ.. నీకు గన్ లైసెన్స్ రీనివల్ చేయిస్తా కానీ నాకు ఒక పని చేసి పెట్టాలి అన్నాడు సీఐ.. అతని మాటలతో అవ్వాక్కైయాడు రవి .. సీఐ ఎంత అడుగుతాడో అని భయపడ్డాడు. సీఐ అడిగిన ఫేవర్ చూసి కొద్ది క్షణాల పాటు ఎం మాట్లాడలేదు రవి.

నా ఆఫిస్‌లో కంప్యూటర్లు కరాబ్ అయ్యాయి..

నువ్వు అడిగినట్టు నేను నీ గన్ లైసెన్స్ రినివల్ కు సహాయం చేస్తాను కానీ నా ఆఫిస్ లో కంప్యూటర్స్ అన్ని పాడయ్యునాయి వాటిని బాగు చేయించు అప్పుడు నీకు గన్ లైసెన్స్ రినివల్ చేయిస్తా అన్నాడు సీఐ. ఆయన చెప్పిన మాటలకు సరేనని చెబుతూనే సీఐ మాట్లాడింది అంతా ఫోన్‌లో రికార్డ్ చేశాడు రవి. వెంటనే ఏసీబీ ఆఫీసర్‌కు కాల్ చేసి విషయం చెప్పాడు. ఈ తతంగం అంతా హైదరాబాద్ శివార్లోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌‌లో చోటు చేసుకుంది.

తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు..

రవి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగారు ఏసీబీ అధికారులు. మంగళవారం ఉదయం నుండి తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. సిఐ శ్రవణ్ మొబైల్ తో పాటు లాప్టాప్ ను వెరిఫై చేస్తున్నారు ఏసీబీ అధికారులు. సీఐ శ్రవణ్ మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ ను పరిశీలిస్తున్నారు ఏసీబీ టీమ్స్..
ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..