Hyderabad: డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎదుట తెలంగాణ టీచర్ల మౌన దీక్ష..! పిల్లలతో సహా అరెస్ట్

|

Jan 21, 2023 | 9:55 PM

పోలీసుల కళ్లు గప్పి ఒక్కసారిగా ఆర్టీసీ బస్సుల్లో వచ్చారు ఉపాధ్యాయ దంపతులు. పిల్లలతో సహా కమిషనర్‌ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Hyderabad: డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎదుట తెలంగాణ టీచర్ల మౌన దీక్ష..!  పిల్లలతో సహా అరెస్ట్
School Education
Follow us on

తెలంగాణ ప్రభుత్వ టీచర్లు ఆందోళన బాట పట్టారు. ఆకస్మికంగా జరిగిన నిరసనతో పోలీసులు ఉరుకులు పరుగులు తీశారు. భార్య భర్తలు ఒకేచోట పనిచేసేలా బదిలీలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆఫీస్‌ను ముట్టడించారు. వందలాదిగా తరలివచ్చిన ఉపాధ్యాయులు.. మౌనంగా తమ ఆవేదనను ప్రభుత్వానికి వివరించే ప్రయత్నం చేశారు. టీచర్ల ఆందోళనతో ఆఫీస్‌ పరిసరాలు రణరంగంగా మారాయి. తోపులాటలు, వాగ్వాదాలతో ఉద్రిక్తంగా మారింది.

కమిషనర్‌ కార్యాలయం ముందు మౌన దీక్షకు ఉపాధ్యాయ స్పౌస్‌ ఫోరమ్‌ పిలుపునిచ్చింది. పోలీసుల కళ్లు గప్పి ఒక్కసారిగా ఆర్టీసీ బస్సుల్లో వచ్చారు ఉపాధ్యాయ దంపతులు. పిల్లలతో సహా కమిషనర్‌ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కమిషనర్‌ కార్యాలయం వద్దకు చేరుకున్న టీచర్లను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేశారు.

భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడం.. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఉపాధ్యాయ దంపతులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. దాదాపు గంట పాటు అరెస్టులు కొనసాగడంతో కొందరు ఉపాధ్యాయులు, పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. 19 జిల్లాల్లో బదిలీలకు అనుమతించిన ప్రభుత్వం మరో 13 జిల్లాల్లో ఆపేయడం న్యాయమా? అని ఉపాధ్యాయ దంపతులు ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ తక్షణమే జోక్యం చేసుకుని తమ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..