Hyderabad: మధ్యాహ్న భోజనం వికటించి 44 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఎక్కడంటే?
హైదరాబాద్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. చంద్రనాయక్ తాండ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత సుమారు 44 మంది విద్యార్థులు కడుపునొప్పితో బాధపడ్డారు. దీంతో వారిని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.

మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలోని 44 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన మాదాపూర్‌లోని చంద్రనాయక్ తాండ పాఠశాలలో వెలుగు చూసింది. గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే అస్వస్థతకు గురైన విద్యార్థులను హాస్పిటల్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. మాదాపూర్‌లోని చంద్రనాయక్ తాండ పాఠశాలలో 44 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసిన గంట సేపటికి తీవ్ర కడుపునొప్పితో బాధపడ్డారు.
అది గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను వెంటనే కొండాపూర్ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ విద్యార్థులను పరీక్షించిన వైద్యులు ఫుడ్ పాయిజన్ కారణంగానే వారు అస్వస్థతకు గురైనట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతరం వారికి అక్కడే చికిత్స అందించారు.
అయితే అస్వస్థతకు గురైన వారిలో ఆరుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని.. మెరుగైన చికిత్స కోసం వారిని నానక్ రాం గూడా రెయిన్ బో హాస్పిటల్‌కు తరలించినట్టు వైద్యులు తెలిపారు. మిగతా విద్యార్థులంతా కొండాపూర్ ఏరియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్టు అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




