AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఆర్టీసీ, మెట్రోలో ప్రయాణించేవారికి డబుల్ గిఫ్ట్.. పాస్ ధరలు భారీగా తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..

హైదరాబాద్ ప్రజలకు భారీ శుభవార్త. మెట్రో, ఆర్టీసీ ప్రయాణికులకు ప్రభుత్వం దీపావళి గిఫ్ట్ అందించనుంది. మెట్రో, ఆర్టీసీ సేవలను వినియోగించుకునేందుకు ప్రభుత్వం కామన్ పాస్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే వీటి ధరలను సగానికి సగం తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీపావళి నుంచే అమలు చేయనుంది.

Hyderabad: ఆర్టీసీ, మెట్రోలో ప్రయాణించేవారికి డబుల్ గిఫ్ట్.. పాస్ ధరలు భారీగా తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..
Hyderabad Common Pass
Venkatrao Lella
|

Updated on: Nov 05, 2026 | 10:55 AM

Share

హైదరాబాద్‌లోని ఆర్టీసీ, మెట్రో ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్ అందింది. ఆర్టీసీ, మెట్రోలలో ప్రయాణించేందుకు వీలుగా ఆగస్టులో ఉమ్మడి పాస్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పాస్‌తో మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో వేర్వురుగా టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకే పాస్‌తో మెట్రో, ఆర్టీసీలలో ప్రయాణించవచ్చు. ఈ పాస్ ధరలు ఎక్కువగా ఉన్నట్లు విమర్శలు రావడంతో త్వరలో ప్రభుత్వం తగ్గించనుందనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఎట్టకేలకు దీపావళి సందర్భంగా తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ శుభవార్త అందించింది. ఉమ్మడి పాస్ ధరలను భారీగా తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల డిమాండ్, వివిధ వర్గాల నుంచి వచ్చిన అభిప్రాయలు, సూచనల ప్రకారం ధరలను తగ్గించాలలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీపావళి రోజు నుంచే వీటిని అమల్లోకి తీసుకురానుందని సమాచారం.

కొత్త పాస్ ధరలు ఇవిగో..

-మెట్రో, ఆర్టీసీ ప్రయాణాలకు ఒక్కరోజు ఉమ్మడి పాస్ ధర రూ.325గా నిర్ణయించినట్లు సమాచారం

-నెలవారీ పాస్ ధర రూ.4 వేలు లేదా రూ.4,500గా నిర్ణయించినట్లు తెలుస్తోంది

-దీపావళి సందర్భంగా నవంబర్ 8 నుంచి కొత్త ధరలను అమల్లోకి తీసుకొచ్చే అవకాశముంది

-ప్రస్తుతం నెలవారీ పాస్ ధర రూ.8,500గా ఉంది. ఇప్పుడు రూ.4 వేలు లేదా రూ.4,500గా ఫిక్స్ చేయనున్నారు

-ప్రస్తుతం రోజువారీ కామన్ పాస్ ధర రూ.400గా ఉండగా.. దీనిని రూ.325కి తగ్గించనున్నారు

-నెల రోజుల వ్యాలిడిటీ గల రూ.4 వేల పాస్ ధరలో ఆర్టీసీకి రూ.వెయ్యి, మెట్రోకు రూ.3 వేలు కేటాయించనున్నారు

-ఒక్కరోజు పాస్ ధర రూ.325లో ఆర్టీసీకి రూ.75, మెట్రోకు రూ.250 కేటాయించే అవకాశముంది

ముగిసిన చర్చలు

ఉమ్మడి పాస్ ధరలు తగ్గించడంతో ఇప్పటికే ఆర్టీసీ, మెట్రో అధికారులు చర్చలు జరిపారు. పాస్ ధరలను తగ్గించాలని ఉమ్మడి నిర్ణయం తీసుకున్నారు. నేడు లేదా రేపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో ఆర్టీసీ ఎండీ, మెట్రో సలహాదారు సమావేశం కానున్నారు. ఈ భేటీలో పాస్ ధరలు తగ్గించడంపై తుది నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ధరల తగ్గింపుపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన జారీ చేసే అవకాశాలున్నాయి. ఉమ్మడి పాస్ ధరలు అధికంగా ఉండటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ధరలు తగ్గించాలంటూ మెట్రో సలహాదారు ఎన్వీఎస్ రెడ్డితో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో సానుకూల నిర్ణయం తీసుకున్నారు. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా.. ప్రభుత్వం కూడా సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీపావళికి ముందే దీనిపై ప్రకటన రానుందని సమాచారం. ధరలు తగ్గిస్తే ఇది ఆర్టీసీ, మెట్రోలలో తరచూ ప్రయాణించేవారికి శుభవార్తగా చెప్పవచ్చు.

Follow Us
Video: హిల్‌ స్టేషన్‌లో సిగ్గుచేటు.. చెత్త ఏరిన విదేశీ యువతి
Video: హిల్‌ స్టేషన్‌లో సిగ్గుచేటు.. చెత్త ఏరిన విదేశీ యువతి
ఆర్టీసీ, మెట్రో ప్రయాణికులకు డబుల్ ధమాకా.. పాస్ ధరలు తగ్గాయ్
ఆర్టీసీ, మెట్రో ప్రయాణికులకు డబుల్ ధమాకా.. పాస్ ధరలు తగ్గాయ్
దక్షిణ భారతంలో దీపావళి అంటే నరకాసుర వధే.. శ్రీకృష్ణుడి విజయగాథ..
దక్షిణ భారతంలో దీపావళి అంటే నరకాసుర వధే.. శ్రీకృష్ణుడి విజయగాథ..
GTA 6 ఆడాలని ఆశపడ్డాడు.. గేమ్ విడుదలకు ముందే కన్నుమూత!
GTA 6 ఆడాలని ఆశపడ్డాడు.. గేమ్ విడుదలకు ముందే కన్నుమూత!
Video: దుబాయ్‌లో రచ్చ.. పాక్ బాక్సర్ చెంప పగలగొట్టిన భారత ఫైటర్!
Video: దుబాయ్‌లో రచ్చ.. పాక్ బాక్సర్ చెంప పగలగొట్టిన భారత ఫైటర్!
ఆ సినిమా కోసం ఎంతో రిస్క్ చేశా.. ఎంతో తెలుసుకున్నా..
ఆ సినిమా కోసం ఎంతో రిస్క్ చేశా.. ఎంతో తెలుసుకున్నా..
ట్రంప్ ఓటమితో బంగారం ధరల్లో కుదుపు.. ఒక్కరోజే అన్నీ తారుమారు..
ట్రంప్ ఓటమితో బంగారం ధరల్లో కుదుపు.. ఒక్కరోజే అన్నీ తారుమారు..
ఒక్క ఆ దేశంలో తప్ప.. ప్రపంచంలో ఎక్కడైనా విరాట్ కోహ్లీ పరుగుల వరదే
ఒక్క ఆ దేశంలో తప్ప.. ప్రపంచంలో ఎక్కడైనా విరాట్ కోహ్లీ పరుగుల వరదే
మదనపల్లెలో లేడీ డాన్ కోనేటి సులోచన అరెస్ట్.. నకిలీ పత్రాలతో..
మదనపల్లెలో లేడీ డాన్ కోనేటి సులోచన అరెస్ట్.. నకిలీ పత్రాలతో..
అందరూ నవ్వినా వెనక్కి తగ్గలేదు.. ఒంటరిగా పోరాడి గెలిచాడు!
అందరూ నవ్వినా వెనక్కి తగ్గలేదు.. ఒంటరిగా పోరాడి గెలిచాడు!