AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తప్పు చేస్తే తప్పించుకోలేరు.. లేడీ డాన్‌కు హైకోర్టులో చుక్కెదురు..!

హైదరాబాద్ లోని ధూల్‌పేట్ ప్రాంతానికి చెందిన అంగూరి బాయ్‌పై పీడి యాక్ట్ కేసుపై మంగళవారం (అక్టోబర్ 28) హైకోర్టు బెంచ్ విచారణ జరిపింది. పిటిషన్‌పై ప్రభుత్వ స్పెషల్ ప్లీడర్ స్వరూప్ ఒరిలా, అసిస్టెంట్ లీడర్ రవి కుమార్ లు వాదనలు వినిపించారు. చివరగా అంగూర్ భాయ్ వేసిన వేసిన పీడీ యాక్ట్ పిటిషన్ ను కొట్టివేస్తూ న్యాయమూర్తులు తీర్పు విలువరించారు.

తప్పు చేస్తే తప్పించుకోలేరు.. లేడీ డాన్‌కు హైకోర్టులో చుక్కెదురు..!
Ladydon Aruna Bhai
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Oct 28, 2025 | 8:22 PM

Share

గంజాయి వ్యాపారాలతో లేడీ డాన్‌గా చెలామణి అవుతున్న అరుణ బాయ్ అలియాస్ అంగూర్ భాయ్ కి హైకోర్టులో చుక్కెదురైంది. తనపై పెట్టిన పీడీ యాక్ట్‌ను సవాలు చేస్తూ.. అంగూర్ భాయ్ హైకోర్టుకు వెళ్ళింది. పీడీ యాక్ట్ పై హైకోర్టులో వేసిన పిటిషన్ పై హైకోర్టు డివిజన్ బెంజ్ న్యాయమూర్తులు మౌసమి భట్టాచార్య, గాడి ప్రవీణ్ కుమార్ వాదనలు విన్న అనంతరం అంగూర్ భాయ్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించారు.

హైదరాబాద్ లోని ధూల్‌పేట్ ప్రాంతానికి చెందిన అంగూరి బాయ్‌పై పీడి యాక్ట్ కేసుపై మంగళవారం (అక్టోబర్ 28) హైకోర్టు బెంచ్ విచారణ జరిపింది. పిటిషన్‌పై ప్రభుత్వ స్పెషల్ ప్లీడర్ స్వరూప్ ఒరిలా, అసిస్టెంట్ లీడర్ రవి కుమార్ లు వాదనలు వినిపించారు. చివరగా అంగూర్ భాయ్ వేసిన వేసిన పీడీ యాక్ట్ పిటిషన్ ను కొట్టివేస్తూ న్యాయమూర్తులు తీర్పు విలువరించారు. గంజాయి లేడీ డాన్ అంగూర్ భాయ్ పై ఎక్సైజ్ శాఖ ఎస్టీఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి, దూళిపేట ఎక్సైజ్ సీఐ మధుబాబు సిబ్బంది కలిసి అంగూర్ భాయ్ పై అనేక కేసులు ఉండడంతో ఆమెపై పిడి యాక్ట్ పెట్టాలని ప్రతిపాదించారు.

అంగూర్ భాయ్ పై పీడీ యాక్ట్ పెట్టాలని ప్రభుత్వం నియమించిన అడ్వైసరీ బోర్డు 2025 మార్చి 10న ప్రతిపాదనలకు పంపించారు. బోర్డు సిఫారసు మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి 2025 ఏప్రిల్ 15న అంగూర్ భాయ్‌పై పీడీ యాక్ట్ అమలు చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు.

పీడీ యాక్ట్ ఉత్తరువులను సవాల్ చేస్తూ అంగూర్ భాయ్ హైకోర్టులో పీడీ యాక్ట్‌పై పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు డివిజన్ బెంచ్ వాదప్రతిపాదనలు విన్న అనంతరం అంగూర్ భాయ్ వేసిన పిటిషన్‌ను కొట్టి వేస్తున్నట్లు న్యాయమూర్తులు తీర్పు వెల్లడించారు. అంగూరు భాయ్ పై పీడీ యాక్ట్ పిటీషన్ ను హైకోర్టులో కొట్టివేయడంపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ డైరెక్టర్ షాన్వాస్ ఖాసిం ఎక్సైజ్ సిబ్బందిని అభినందించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్