Telangana: అత్యాచారం చేసి.. ఆపై హత్య.. అనుమానం రాకుండా ఆమె ఫోన్ నుంచే..

అబద్ధం చెప్పి ఏడడుగల మేడ కట్టొచ్చేమ్మో.. నిజం అనే పునాది లేకపోతే ఆ బంగ్లా నిలవగలదా..నిజాన్ని సమాధి చేశాననుకున్నాడు. స్నేహితుడితో కలిసి సంబరాలు చేసుకున్నాడు. నిజం బయటకొస్తే ఎంత ప్రమాదమో తెలిసేసరికి జైలుకెళ్లాడు.

Telangana: అత్యాచారం చేసి.. ఆపై హత్య.. అనుమానం రాకుండా ఆమె ఫోన్ నుంచే..
Accused Srisailam
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 11, 2022 | 6:28 PM

అందరిలాగే ఆమె కూడా బాగా చదువుకోవాలనుకుంది. స్నేహితులు, సీనియర్లు పెద్ద పెద్ద చదువులు చదివేందుకు విదేశాలకు వెళ్తున్నారు. ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఆమెకూ అలా కావాలనిపించింది. మంచిగా చదువుకుని..పెద్ద ఉద్యోగం సంపాదించి..తల్లిదండ్రులను సంతోషపర్చాలనుకుంది. సగంలోనే చనిపోయింది.. సారీ చంపబడింది. చదువు పూర్తి కాకుండానే జీవితం ముగిసింది.కాదు..కాదు..ముగించేశాడు ఓ దుర్మార్గుడు.

ఎంబీఏ చదవాలనుకుంది..లండన్‌ వెళ్లాలనుకుంది. భవిష్యత్తుపై ఎన్నో కలలుగంది.. తండ్రిని ఒప్పించాలని తల్లిని కోరింది.. ఏ తల్లయినా పిల్లల ఎదుగుదలే కదా కోరుకునేది..అందుకే..ఆ అమ్మ కూడా ఈ అమ్మాయి కోరికను కాదనలేకపోయింది. సరే తల్లీ.. నాన్నతో నేను చెబుతాలే.. నువ్వు భయపడకు..నేను ఒప్పిస్తాలే.. హాయిగా చదువుకుందువు కానీ..నువ్వు బాగా చదివితే మాకూ సంతోషమే కదా అని కూతురికి ధైర్యం చెప్పింది. అప్పుడు బిడ్డ కళ్లలో మెరిసిన ఆనందాన్ని చూసి ఆ తల్లి మనసు ఎంత సంబరపడిందో మాటల్లో చెప్పగలమా.. ఆ తర్వాత కూతురు హత్యకు గురైనప్పుడు పడిన క్షోభను కూడా మాటల్లో చెప్పలేం..

ఆ రోజు రాత్రి ఆమె చాలా హ్యాపీగా ఉంది.. అమ్మ.. నాన్నను ఒప్పిస్తుంది. నేను కూడా లండన్‌ వెళ్తాను.. బాగా చదువుకుంటాను. పెద్ద జాబ్‌ కొట్టేస్తా..లైఫ్‌లో బాగా సెటిలవుతానని ఏవేవో కలలు ఆమెకు నిద్రపట్టనీయలేదు. అలా ఆలోచిస్తూనే.. ఎప్పుడో అర్ధరాత్రి బాగా పొద్దుపోయాక రెప్ప వాల్చింది. కళ్లు మూతలు పడ్డాయి. కానీ అదే ఆమె చివరి నిద్ర అని ఆమెకు తెలియదు. ఆ తర్వాతి రోజు శాశ్వత నిద్రలోకి పోతుందని ఆమె ఎలా ఊహించగలదు. కానీ తనొకటి తలిస్తే.. యముడు ఇంకొకటి తలిచాడు. పాత బాకీ సెటిల్మెంట్‌ ఉందన్నట్లు..ఎందుకో అంత తొందరగా ఆమెను..ఓ కాలయముడు కాలరాసేలా రాత రాశాడు. పాశంతో ప్రాణాలు తీసుకెళ్లాడు.

తెల్లారింది. ఆ రోజు సెప్టెంబర్‌ 5. అమ్మా…. నాన్నకు చెప్పావా అని అడిగింది. నేను చూసుకుంటాలేవే..నువ్వు ప్రశాంతంగా ఉండు.. నిన్ను లండన్‌ పంపించే బాధ్యత నాది అని కూతురికి తల్లి భరోసా ఇచ్చింది. ఆ రోజు సెప్టెంబర్‌ 5..ఆమె సెల్‌కు ఓ కాల్‌ వచ్చింది. కాసేపు మాట్లాడుకుందాం.. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూరుకు రావాలని కాల్‌లోని మేటర్‌.. ఫోన్‌ చేసింది. ఆమె కాదు..అతడే.. అతడి పేరు శ్రీశైలం. ఈ విషయం అమ్మకు చెప్పలేదు. తానెక్కడికి వెళ్తోందో తనకు మాత్రమే తెలుసు. ఒక్కమాట తల్లికి చెప్పినా..స్నేహితులకు చెప్పినా.. కనీసం తానెక్కడుందీ మెసేజ్‌ చేసినా.. ఇప్పుడీ పరిస్థితి వచ్చుండేది కాదేమో.. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన ఆమె..హతమవుతుందని ఏ తల్లిదండ్రులు ఊహించగలరు. ఏ స్నేహితులు కనిపెట్టగలరు.

శ్రీశైలం మాటలు నమ్మిన ఆ యువతి..భూత్పూరు వెళ్లింది. అప్పటికే అక్కడ గోతికాడి నక్కలా వెయిట్‌ చేస్తున్న శ్రీశైలం.. ఆమెను బైక్‌పై ఎక్కించుకున్నాడు. మానాజీపేటలోని తన కోళ్ల ఫారం వద్దకు తీసుకెళ్లాడు. ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలైంది. అతడు ప్లాష్‌బ్యాక్‌ గుర్తు చేస్తున్నాడు. ఆమె అవన్నీ వద్దని చెప్పింది. తనకు ఇష్టంలేదని క్లారిటీ ఇచ్చింది. ఇక్కడితో ఇది వదిలిపెట్టాలని కోరింది. అతడు మాత్రం ఒకటేమాట మీద ఉన్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. ఆమె ఇష్టం లేదని మొహంమీద గుద్దినట్లు చెప్పింది. అయినా శ్రీశైలం వినలేదు. ఆమె పరిస్థితిని అర్థం చేసుకోకుండా మొండిగా వాదించాడు. పెళ్లి చేసుకోవాల్సిందే..లేదంటే చంపేస్తానని ఏవేవో గట్టిగా మాట్లాడాడు. ఆమె మాత్రం..ఒకేమాట చెప్పింది. శ్రీశైలం.. ఎందుకిలా చేస్తున్నావ్‌. ఏదో పరిచయం అని మాట్లాడితే..ఇంత దూరం తెచ్చావ్‌.. అసలు నువ్వు మనిషేనా..నీకసలు బుద్ధుందా..ఎందుకు సైకోలా బిహేవ్‌ చేస్తున్నావ్‌.. నేను పై చదువులకు ఫారిన్‌ వెళ్తున్నాను..నన్ను వదిలెయ్‌.. ప్లీజ్‌ శ్రీశైలం..ఏదో పిలిస్తే..పాపం అని వస్తే..ఇలా చేస్తున్నావ్‌.. అని నెత్తినోరు మొత్తుకుంది. అయినా శ్రీశైలానికి ఇవేవీ అర్థం కాలేదు. మంకుపట్టు పట్టాడు. నాకు దొరకనిది ఇంకెవరికీ దొరక్కూడదని డైలాగులు చెబుతూ..ఆమెపై తోడేలులా దూకాడు..విచక్షణా రహితంగా ఆమెను కొట్టాడు. కోళ్ల ఫారం దగ్గర కోళ్ల సౌండ్‌ మధ్య ఆమె అరుపులు గాలిలో కలిశాయి..మరెవరికి వినిపించినా..ఆమె బతికేదేమో.. శ్రీశైలం అంత ఛాన్స్‌ ఇవ్వలేదు. అక్కడే ఆమెను అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమె చున్నీతోనే ఆమె మెడకు బిగించి హత్య చేశాడు. పగ తీరిందని రిలాక్స్‌ అయ్యాడు. కసితీరా అనుభవించానని ఖుషీగా ఫీలయ్యాడు. ఎవరికీ తెలియకుండా చంపేసి.. ఏదో ఘనకార్యం సాధించినట్లు ఫీలయ్యాడు. కానీ నిజాన్ని దాచలేరు కదా.. మరేం చేయాలి.. ఆమె డెడ్‌బాడీని ఏం చేయాలి..అప్పుడే.. శివ అనే తన రిలేటివ్‌ను శ్రీశైలం పిలిపించాడు. ఇద్దరూ కలిసి భూత్పూరు కాలువ దగ్గర్లో ఆమె శవాన్ని పూడ్చిపెట్టారు. చేతులు దులిపేసుకున్నారు.

సెప్టెంబర్‌ 5న ఉదయం కాలేజీకని వెళ్లిన కూతురు రాత్రయినా ఇంటికి రాలేదు. తల్లి గుండెల్లో దడ మొదలైంది. అమ్మాయి ఫ్రెండ్స్‌కు ఫోన్‌ చేసింది. తను కాలేజీకే రాలేదు ఆంటీ అని చెప్పేసరికి గుండె జారిపోయినంత పనైంది. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. భర్తకు విషయం చెప్పింది. రాత్రి పది గంటల ప్రాంతంలో మైలార్‌దేవ్‌ పల్లి పోలీసులకు కంప్లయింట్‌ చేశారు. శ్రీశైలంపైనే అనుమానం ఉందన్నారు. పోలీసులు శ్రీశైలాన్ని అదుపులోకి తీసుకుని మక్కిలిరగ్గొట్టారు. మొత్తం కక్కించారు. నేరుగా ఆమె మృతదేహాన్ని పూడ్చిన దగ్గరకు తీసుకెళ్లారు. అప్పుడు ఆ తల్లిదండ్రుల నోట మాటొస్తుందా.. రాత్రే కదా..లండన్‌ వెళ్తాను..నాన్నను ఒప్పించు అని చెప్పింది.. 24 గంటల్లో కూతురు బతుకు ఇలా తెల్లారిందేంటి అని. ఆమె పడిన వేదన వర్ణనాతీతం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం