Vitamin D in rice: తెలంగాణ రైతు అద్భుత సృష్టి.. ‘డి’ విటమిన్ బియ్యంతో దేశవ్యాప్తంగా ఖ్యాతి

|

Feb 13, 2021 | 5:10 PM

హ్యూమన్ బాడీకి డి విటమిన్ చాలా అవసరం. అది తక్కువగా ఉంటే డి విటమిన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోమని డాక్టర్లు సూచిస్తారు. మరీ తక్కువగా ఉంటే.. డి విటమిన్ క్యాప్సిల్స్ వేసుకోమని చెబుతారు.

Vitamin D in rice:  తెలంగాణ రైతు అద్భుత సృష్టి.. డి విటమిన్ బియ్యంతో దేశవ్యాప్తంగా ఖ్యాతి
Follow us on

హ్యూమన్ బాడీకి డి విటమిన్ చాలా అవసరం. అది తక్కువగా ఉంటే డి విటమిన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోమని డాక్టర్లు సూచిస్తారు. మరీ తక్కువగా ఉంటే.. డి విటమిన్ క్యాప్సిల్స్ వేసుకోమని చెబుతారు. అయితే ఇప్పుడు అవన్నీ అక్కర్లేదు. తాజాగా డి విటమిన్ రైస్ అందుబాటులోకి వచ్చాయి. అది కూడా ఇతర రాష్ట్రాలలోనో, ఇతర దేశాలలోనో అనుకోకండి. మన తెలంగాణలోనే. అవును తెలంగాణ రైతన్న ఈ బియ్యాన్ని పండించాడు. రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి  ఈ అద్భతాన్ని ఆవిష్కరించాడు. సేంద్రియ పద్ధతుల్లో సాగుచేసే బియ్యం, గోధుమల్లో డీ విటమిన్‌ అధిక మొత్తంలో ఉండేలా వినూత్న ఫార్ములాను రూపొందించారు. సాధారణంగా బియ్యం, గోధుమల్లో విటమిన్‌ డి పెద్ద మొత్తంలో ఉండదు. అయితే వెంకటరెడ్డి ఫార్ములా ప్రకారం రూపొందించిన ద్రావణాలను పంటపై పిచికారీ చేస్తే బియ్యం, గోధుమల్లో విటమిన్‌ డీ అధిక మోతాదులో వస్తుందని ఆయన చెబుతున్నారు.

తన ఫార్ములాపై ఇంటర్నేషనల్‌ పేటెంట్‌ కోసం గత ఏడాది అప్లై చేయగా, తాజాగా నోటిఫికేషన్‌ వచ్చింది. చింతల వెంకటరెడ్డి మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని అల్వాల్‌కు చెందిన ప్రముఖ ద్రాక్ష రైతు. రసాయనాలు వాడకుండా, జన్యుమార్పిడి వంటి ఖరీదైన సాంకేతికతల జోలికి వెళ్లకుండా ధాన్యం, గోధుమ పంటల్లో ఎక్కువ మోతాదులో విటమిన్‌ డి వచ్చేలా వెంకటరెడ్డి కొత్త ఫార్ములాను రూపొందించారు. బియ్యంలో విటమిన్‌ డి సాధించిన ఫార్ములాకు పేటెంట్‌ హక్కు పొందడానికి అంతర్జాతీయ మేధో హక్కుల సంస్థ(డబ్లు్యఐపీవో) తాజాగా పచ్చాజెండా ఊపింది. పేటెంట్‌ కోఆపరేషన్‌ ట్రీటీ (పీసీటీ) ధ్రువీకరణ ఇచ్చింది. అతని ఫార్ములాపై 130 దేశాల పేటెంట్‌ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకొని జాతీయస్థాయి పేటెంట్‌ హక్కులు పొందే ఛాన్స్ లభించింది.

వరిని సాగు చేసేటప్పుడు  ‘విటమిన్ ఏ’ను కలపడం, సూర్యరశ్మి దానికి తోడవడంతో ‘విటమిన్‌ డి’తో కూడిన వరి ధాన్యం వస్తుందని చింతల వెంకటరెడ్డి చెబుతున్నారు. సీ విటమిన్‌తో కూడిన వరి, గోధుమలను ఉత్పత్తి చేయాలన్నా తన వద్ద అందుకు సంబంధించిన ఫార్ములా ఉందన్నారు వెంకటరెడ్డి. రైతులు పండిస్తానంటే ఈ ఫార్ములా వారికి చెప్తానని, వ్యాపార అవసరాల కోసమైతే తన వద్ద అనుమతి తప్పనిసరి అని ఆయన చెబుతున్నారు.

మట్టి సేద్యంతో ప్రసిద్ధి పొందిన చింత వెంకట్ రెడ్డి గత ఏడాది పద్మశ్రీ పురస్కారంతో గౌరవించబడ్డారు. గతంలో ఆవిష్కరించిన ‘మట్టి సేద్యం’ఫార్ములాను దేశవ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు ఉపయోగించుకుంటూ ప్రయోజనం పొందుతున్నారు.

Also Read:

తూర్పు గోదావరి జిల్లాలో కలకలం.. ఐదు రోజుల క్రితం భర్త హత్య, తాజాగా భార్య ఆత్మహత్య.. ఏంటీ మిస్టరీ!

Uppena first day collection: మెగా మేనల్లుడి రికార్డ్.. తొలిరోజు ‘ఉప్పెన’లా వచ్చిన కలెక్షన్స్