Hyderabad Police: దుబాయ్‌లో పిచ్చి పిచ్చిగా వాగాడు.. హైదరాబాద్‌కు వచ్చి అడ్డంగా బుక్కయ్యాడు..

|

Feb 27, 2021 | 9:09 PM

Hyderabad Police: దుబాయ్‌లో ఉండి యూట్యూబ్‌లో విద్వేషపూరిత ప్రసంగం చేసిన యూట్యూబర్‌ను హైదరాబాద్‌ పోలీసులు ఎట్టకేలకు..

Hyderabad Police: దుబాయ్‌లో పిచ్చి పిచ్చిగా వాగాడు.. హైదరాబాద్‌కు వచ్చి అడ్డంగా బుక్కయ్యాడు..
Man-Arrested
Follow us on

Hyderabad Police: దుబాయ్‌లో ఉండి యూట్యూబ్‌లో విద్వేషపూరిత ప్రసంగం చేసిన యూట్యూబర్‌ను హైదరాబాద్‌ పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకెళితే.. హైదరాబాద్‌లోని బార్కాస్ ప్రాంతానికి చెందిన అబూ ఫైసల్ దుబాయ్‌లో నివసిస్తున్నాడు. అయితే, అక్కడ ‘ధమాకా’ అనే యూట్యూబ్ చానెల్‌ను రన్ చేస్తున్నాడు. ఈ యూట్యూబ్‌లో అక్కడ వార్తా విశేషాలను తెలిపేవాడు. ఈ క్రమంలో పలుమార్లు మత విధ్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగిస్తూ వీడియోలు పోస్ట్ చేశాడు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో తయారైన కరోనా వ్యాక్సిన్‌ను ముస్లింలు తీసుకోవద్దంటూ ప్రచారం చేశాడు. ఈ వ్యాక్సిన్‌ను ముస్లిం జనాభా తగ్గించే కుట్రలో తయారు చేశారంటూ తప్పుడు ప్రచారం సాగించాడు.ఈ విషయాన్ని గో సంరక్షక సంఘం ద్వారానే తనకు తెలిసిందని, ఇండియన్ కరోనా వ్యాక్సిన్ తీసుకోవద్దంటూ తేల్చి చెప్పాడు.

అయితే, ఈ విద్వేషపూరిత వీడియోలపై ముంబైకి చెందిన ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి అక్కడి కోర్టులో ఫిర్యాదు చేశాడు. అబూ ఫైసల్ చేసిన వీడియోలో విద్వేషపూరిత ప్రసంగం ఉందని ఆరోపించాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ నుంచి యూట్యూబర్ అబూ ఫసల్‌ను శాశ్వతంగా తొలగించాలని, అతని వీడియోలను సైతం తొలగించాలని పిటిషన్‌లో కోర్టును కోరాడు. దానిపై విచారించిన ధర్మాసం.. యూట్యూబ్ నుంచి అబూ ఫైసల్ వీడియోలను తీసివేయాలని ఆదేశించింది. దాంతో అతని వీడియోలను యూట్యూబ్ నుంచి తొలగించారు.

ఇదిలాఉంటే.. ఈ వీడియోలను సుమోటోగా తీసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 153(ఏ) కింద అబూ ఫైసల్‌పై కేసు నమోదు చేశారు. అయితే, అతను దుబాయ్‌లో ఉండటంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే, అబూ ఫైసల్ తాజాగా హైదరాబాద్‌కు వచ్చాడు. ఇప్పటికే అతనిపై లుక్ ఔట్ నోటీసులు ఉండటంతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అబూ ఫైసల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అప్పగించారు. దాంతో పోలీసులు ఇవాళ అతన్ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అబూ ఫైజల్‌కు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు అతన్ని జైలుకు తరలించారు.

Also read:

Petrol to Cost Rs 160/Litre: హైదరాబాద్‌లో ఆక్టేన్ ప్రీమియం పెట్రోల్ లీటరు ధర రూ.160.. ఈ రేటు ఎందుకింతో తెలుసా..

డ్రైవింగ్ లైసెన్స్ కష్టాలకిక చరమగీతం.. లైసెన్స్ పునరుద్ధరణ, డూప్లికేట్ లైసెన్స్‌, అడ్రస్ చేంజ్ వంటివన్నీ ఇక మేడ్ ఈజీ