Hyderabad: చైన్ లాగిన రైల్వే కానిస్టేబుల్.. ట్రైన్‌ది మాత్రం కాదండోయ్.. స్టోరీ తెలిస్తే ఇదే పాడు బుద్ది అంటారు..!

ఇంటి రెంట్ల కోసం అని మాట్లాడుతూ ఒక్కసారిగా మహిళ మెడలో చైన్ లాక్కేళ్ళాడు దుండగుడు. ఇది ఎవరో ఆకతాయి రౌడీ చేసిన పని కాదు.. రిపీటెడ్ చైన్ స్నాచర్ చేసిన నేరం కానే కాదు.. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ఓ పోలీస్ ఈ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. ఈ ఘటన మరేక్కడో కాదు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే చోటుచేసుకుంది.

Hyderabad: చైన్ లాగిన రైల్వే కానిస్టేబుల్.. ట్రైన్‌ది మాత్రం కాదండోయ్.. స్టోరీ తెలిస్తే ఇదే పాడు బుద్ది అంటారు..!
Arrest

Edited By:

Updated on: Jul 20, 2023 | 10:40 AM

ఇంటి రెంట్ల కోసం అని మాట్లాడుతూ ఒక్కసారిగా మహిళ మెడలో చైన్ లాక్కేళ్ళాడు దుండగుడు. ఇది ఎవరో ఆకతాయి రౌడీ చేసిన పని కాదు.. రిపీటెడ్ చైన్ స్నాచర్ చేసిన నేరం కానే కాదు.. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ఓ పోలీస్ ఈ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. ఈ ఘటన మరేక్కడో కాదు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే చోటుచేసుకుంది. స్థానిక చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటుంది ఓ మహిళ. ఆవిడ వయసు సుమారు 72 సంవత్సరాలు ఉంటుంది. ఇంటి ముందు శుభ్రం చేస్తున్న క్రమంలో ఉదయం 6:30 ప్రాంతాల్లో అక్కడికి వచ్చాడు ఒక యువకుడు. ఇంటి రెంట్ ఎంత అని మాట్లాడుతూనే వృద్ధురాలి మెడలో నుండి గొలుసు లాక్కెళ్లాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ద్వారా కేసును చేధించిన పోలీసులు.. నిందితుడు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అని గుర్తించారు.

ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అయిన హర్షవర్ధన్(25)కు వచ్చే జీతం సరిపోక చైన స్నాచింగ్‌కు పాల్పడినట్లు గుర్తించారు. అతని వద్ద నుంచి 4 తులాల మంగళసూత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హర్షవర్ధన్‌ను అరెస్ట్ రిమాండ్‌కు తరలించారు. కాగా, అతని వక్రబుద్ధి కారణంగా అటు ప్రభుత్వ ఉద్యోగం.. ఇటు పరువు రెండూ పోయాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..