ఐస్ క్రీం ప్రియులు.. హాట్ సమ్మర్ లో .. కూల్ ఐస్‌క్రీం లాగిస్తున్నారా?, మీ పిల్లలు మారం చేస్తున్నారని ఐస్‌క్రీం తినిపిస్తున్నారా? అయితే మీరు డబ్బులతో రోగం కొనితెచ్చున్నట్టే. ఎందుకంటారా.. ఓసారి మేము చెప్పేది వినండి. ఒక్కక్షణం ఆలోచించండి. ఐస్ క్రీం తినేముందు ఒక్కసారి టీవీ9 కథనాలను గుర్తుచేసుకోండి.
హైదరాబాద్ కేంద్రంగా ఫేక్ ఐస్‌క్రీం, చాక్లెట్లు విచ్చలవిడిగా తయారు చేస్తున్నారు నకిలీగాళ్లు. పిల్లలు, పెద్దల ప్రాణాలతో చలగాటమాడుతున్నారు. ఐస్ క్రీం ప్రియుల ఆసక్తిని ఆసరగా చేసుకొని.. డబ్బు మాయలో నకిలీ పదార్థాలతో ఐస్ క్రీం తయారు చేస్తున్నారు.. ప్రజల ప్రాణాలతో చలాగాటమాడుతున్నారు.
నిన్న చందానగర్ లో ఫేక్ ఐస్‌క్రీం, రాజేంద్రనగర్ లో నకిలీ చాకెట్ల కథనాలను ముందుకు తెచ్చింది టీవీ9. ఈ ఘటనలు మరువక ముందే ఇవాళ కూకట్‌పల్లి లో మరో ఫేక్ ఐస్ క్రీం ఘటన కలకలం రేపింది. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా నకిలీ ఐస్ క్రీం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్న కేటుగాళ్ల గుట్టు విప్పింది టీవీ9. కల్తీ పదార్థాలు, కలర్స్ లతో ఐస్ క్రీమ్ ను తయారు చేస్తున్న విజువల్స్ టీవీ9 కెమెరాకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కింది. కల్తీ ఐస్ క్రీమ్ లకు బ్రాండెడ్ స్టిక్కర్లు జోడించి మార్కెట్లో అమ్ముతున్నారు. ఎక్స్‌పైరీ అయిన మెటీరియల్ ఉపయోగించి ఐస్ క్రీమ్ లను తయారు చేస్తున్నారు నిందితులు.
నిన్న చందానగర్, ఇవాళ కూకట్ పల్లి, పేట్ బషీర్‌బాద్ ప్రాంతాల్లో కల్తీ ఐస్ క్రీమ్ తయరీ కేంద్రాలపై బాల్ నగర్ ఎస్ఓటి పోలీసులు కూకట్పల్లి పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. సంశిగుట్టలో అను ఫ్రోజెన్ ఫుడ్స్ పై రైడ్ చేసి 15 లక్షల విలువ చేసే సామాగ్రిని సీజ్ చేశారు అధికారులు. లైసెన్స్ లేకుండా ఐస్ క్రీం ఫ్యాక్టరీని రన్ చేస్తున్న నిర్వాహకుడు రమేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. టోటల్ గా సైబరాబాద్ పరిధిలో రెండు రోజుల వ్యవధిలో 28 లక్షల విలువచేసే కల్తీ ఐస్ క్రీములను స్వాధీనం చేసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..