ఫ్రెండ్‌ను చంపి.. గుండెను బయటకు తీసి.. ఆ ఫొటోను లవర్‌కు పంపిన కిరాతక ఘటన కలకలం రేపుతోంది. ప్రేమ వ్యవహారంలో గొడవ తలెత్తి స్నేహితుడు, తోటి విద్యార్థే అత్యంత కిరాకతకంగా హతమార్చాడం సంచలనం రేపుతోంది. ఇప్పుడో విషయం హాట్ టాపిగ్గా మారింది. హత్య తరువాత నిందితుడు హరహర కృష్ణ.. ఈ విషయాన్ని అమ్మాయికి ఫోన్ చేసి చెప్పాడు. నవీన్‌ను చంపినట్లు వాట్సాప్‌లో మెసేజ్ కూడా పెట్టాడు. ఈ వేలే కదా నిన్ను తాకింది. ఇదిగో ఆ వేలు ఇదేనంటూ నవీన్ వేలును కోసి ఆ ఫొటో అమ్మాయికి పంపాడు. ఈ పెదాలే కదా నిన్ను తాకింది. అంటూ పెదాలు కోసి ఆ ఫొటోనూ పంపాడు. ఈ గుండెనే కదా నిన్ను తాకింది.. అంటూ నవీన్ గుండెను కోసి మెసేజ్ పెట్టాడు. చివరకు నవీన్ తలను వేరు చేసి దూరంగా పడేశాడు, హర హర కృష్ణ మెసేజ్‌లు చదివిన అమ్మాయి జోక్ అనుకుందో లేక మరేమనుకుందో.. అవునా.. ఓకే, అంటూ రిప్లై ఇచ్చింది.
సంచలనం రేపిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమ్మాయి పాత్రపై కూడా విచారణ జరపనున్నట్లు చెబుతున్నారు పోలీసులు. అబ్దుల్లాపుర్‌మెట్ పోలీసుల ఎదుట హరి లొంగిపోయాడు. నిందితుడు హరహర కృష్ణపై.. 302, 201, 3(2)(v), ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నవీన్‌ను చంపినట్టు హర హర కృష్ణ ఒప్పుకున్నాడని.. 3 నెలల కిందటే నవీన్ హత్యకు ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. ఈ నెల 17న నవీన్‌ను బైక్‌పై తీసుకెళ్లి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. నవీన్‌ను చంపి శరీరం నుంచి తలను వేరుచేసిన హరహరకృష్ణ.. ఆ తర్వాత భాగాలుగా విభజించాడు.
నల్గొండ ఎంజీ యూనివర్సిటీలో నవీన్, హరి ఇంజనీరింగ్ EEE ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. చదువులోనే కాదు..ప్రేమలోనూ పోటీ సడి ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించారు. దీంతో వీరి మధ్య వివాదం తలెత్తింది. ఇదే విషయంలో చాలాసార్లు గొడవపడ్డారు. ఈ నేపధ్యంలోనే ఈనెల 17న పార్టీ చేసుకుందామని అబ్దుల్లాపుర్‌మెట్‌లోని తన ఫ్రెండ్ రూమ్‌కి హరిని పిలిచాడు నవీన్. అక్కడే ఇద్దరూ మద్యం తాగారు. అనంతరం మరోసారి లవర్ విషయమై ఇద్దరి మధ్య టాపిక్ వచ్చింది. దీంతో మళ్లీ రగడ మొదలైంది. మాటా మాటా పెరిగి ఆవేశంలో నవీన్‌ను హరి దారుణంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.కుమారుడి ఆచూకీ తెలియకపోవడంతో నవీన్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..