Telangana Election: ముక్కోణపు పోటీగా మారిన హుజూరాబాద్.. ఈటెల తరుపున ఆయన భార్య జమునా ప్రచారం
ఇప్పుడు అందరి దృష్టి హుజూరాబాద్ నియోజకవర్గంపైనే ఉంది. ఇక్కడి నుంచి బీజేపీ నేత ఈటెల రాజేందర్ పోటీ చేయడంతో, ఏం జరుగుతుందనే చర్చ సాగుతుంది. మొన్నటి వరకు బీజేపీ , బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉండేది. కానీ, మారిన రాజకీయ పరిణామాలతో వేగంగా కాంగ్రెస్ కూడా పుంజుకుంది. దీంతో హుజూరాబాద్‌లో త్రిముఖ పోరుగా మారింది.

ఇప్పుడు అందరి దృష్టి హుజూరాబాద్ నియోజకవర్గంపైనే ఉంది. ఇక్కడి నుంచి బీజేపీ నేత ఈటెల రాజేందర్ పోటీ చేయడంతో, ఏం జరుగుతుందనే చర్చ సాగుతుంది. మొన్నటి వరకు బీజేపీ , బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉండేది. కానీ, మారిన రాజకీయ పరిణామాలతో వేగంగా కాంగ్రెస్ కూడా పుంజుకుంది. దీంతో హుజూరాబాద్‌లో త్రిముఖ పోరుగా మారింది. ఇప్పటికే, ఈ నియోజకవర్గం మొత్తం పర్యటిస్తున్నారు ముగ్గురు అభ్యర్థులు. పార్టీల అగ్రనేతలు కూడా రంగంలోకి దిగారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మరోసారి ఈటెల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు. బీఆర్ఎస్ నుంచి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరుఫున ప్రణయ్ పోటీ పడుతున్నారు. ఇక్కడి నుంచి వరుసగా ఈటెల రాజేందర్ విజయం సాధిస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి, బీజేపీలో చేరిన తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ విజయం సాధించారు. అయితే, ఈయన హుజూరాబాద్‌తో పాటు, సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు.
అయితే, ఈసారి హుజూరాబాద్‌లో సమయం తక్కువ కేటాయిస్తున్నారు. గజ్వేల్‌తో పాటు, మిగతా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రాజేందర్ తరుపున ఆయన భార్య జమునా ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే.. బీజేపీ బీసీ ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటిచింది. దీంతో.. రాజేందర్ సీఎం అవుతారనే ప్రచారం జరుగుతుంది. ఇదే ప్రచారాన్ని చేస్తున్నారు బీజేపీ నేతలు. ఇక్కడ గత ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గట్టి పోటీ ఉండేది. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ కూడా పుంజుకుంది.. దీంతో నియోజకవర్గంలో త్రిముఖ పోటీగా మారింది. ఈ త్రిముఖ పోరులో ఎవరు గెలుస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే, ఇటీవల చాలా మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈటెల రాజేందర్ వ్యతిరేక ఓట్లు చీలుతే, కొంత బీజేపీకే లాభం జరిగే అవకాశం ఉంది.
ఈటెల రాజేందర్ మాత్రం గతంలో చేసిన అభివృద్ధి, బీసీ నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఎక్కువ సమయం ఇవ్వవడం లేదని, ఈ విషయాన్ని ఓటర్లు అర్థం చేసుకోవాలని అంటున్నారు. ఎక్కవగా బీజేపీ నేతలే ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమైన రోడ్డు షోలు, ఇతర సభలో పాల్గొంటున్నారు. టీఆర్ఎస్ కి గుణపాటం చెప్పాలని కోరుతున్నారు. ఈటెల రాజేందర్ సతీమణి జమునా పూర్తి ప్రచార బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఎన్నికల దగ్గర పడిన కొద్దీ, ప్రచారాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి రెండు నెలల నుంచీ ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా.. ఈసారి తననే గెలుస్తాననే ధీమాతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అంతేకాకుండా.. రాజేందర్‌పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే ఇక్కడ కేసీఆర్ పర్యటించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత జోష్ పెరిగింది.
ఈ రెండు పార్టీలకు గుణ పాఠం చెప్పాలని కోరుతున్నారు కాంగ్రెస్ అభ్యర్థి ప్రణయ్. ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని చెబుతున్నారు. ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు.. గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తూ ముందుకు సాగుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
