AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు.. మద్యం మత్తులో భార్యపై దారుణం.. ఆపై..

నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తే కాలయముడై భార్యను కత్తితో పొడిచి కడ తేర్చాడు. అంతటితో ఆగకుండా తాను కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తాగుడుకు బానిసైన..

Telangana: కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు.. మద్యం మత్తులో భార్యపై దారుణం.. ఆపై..
Crime
Ganesh Mudavath
|

Updated on: Nov 06, 2022 | 1:08 PM

Share

నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తే కాలయముడై భార్యను కత్తితో పొడిచి కడ తేర్చాడు. అంతటితో ఆగకుండా తాను కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తాగుడుకు బానిసైన భర్త సైకో గా మారి గత కొంతకాలంగా భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. రాత్రి 2 గంటలకు భార్యతో గొడవపడి విచక్షణ కోల్పోయి ఈ దారుణానికి పాల్పడ్డాడు. బిజినేపల్లి కి చెందిన అబ్దుల్ నబీ, అబ్దుల్ జాహిదాబేగంలు దంపతులు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలలు సంతానం. అయితే భర్త అబ్దుల్ నబీ తాగుడుకు బానిసై సైకో గా మారాడు. గత కొంతకాలంగా భార్యను హింసిస్తూ చిత్ర వధకు గురి చేశాడు. అయితే రాత్రి రెండు గంటల ప్రాంతంలో నిద్రిస్తున్న భార్యను లేపి గొడవకు దిగాడు. విచక్షణ రహితంగా కొట్టాడు. ఇంట్లో ఉన్న కత్తితో భార్యను దారుణంగా పొడిచి హత్య చేశాడు. ఈ సంఘటనతో భయానికి గురైన అబ్దుల్ నబీ అదే కత్తితో గొంతు కోసుకోవడంతోపాటు కడుపులో పొడుచుకున్నాడు.

విషయం తెలుసుకున్న బాధితురాలు బంధువులకు తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని, గాయాల పాలైన బాధితుడిని నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని మార్చరికి తరలించారు. ఈ సంఘటనపై మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!