AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తవ్వకాలకు వెళ్లగా కనిపించిన ఆరడుగుల గొయ్యి.. ఏంటా అని వెళ్లి చూసి బిత్తరపోయారు..!

పురాతన ప్రాంతం అని తెలిస్తే చాలు.. గుప్తనిధుల కోసం గ్యాంగులకు గ్యాంగులు దిగిపోతున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నారో ఎలా వస్తున్నారో తెలియట్లేదు కానీ.. స్థానికులను మాత్రం హడలెత్తిస్తున్నారు. క్షుద్రపూజలతో కూడిన తవ్వకాలు జరుపుతూ... జనాలు బెంబేలెత్తిపోయేలా చేస్తున్నారు. లేటెస్ట్‌గా కరీంనగర్‌ జిల్లాలోని మొలంగూర్‌లో ఓ బ్యాచ్ దిగడం స్థానికంగా కలకలం రేపింది.

తవ్వకాలకు వెళ్లగా కనిపించిన ఆరడుగుల గొయ్యి.. ఏంటా అని వెళ్లి చూసి బిత్తరపోయారు..!
Kakatiya Fort , Molangur
G Sampath Kumar
| Edited By: |

Updated on: Mar 31, 2026 | 8:24 AM

Share

పురాతన ప్రాంతం అని తెలిస్తే చాలు.. గుప్తనిధుల కోసం గ్యాంగులకు గ్యాంగులు దిగిపోతున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నారో ఎలా వస్తున్నారో తెలియట్లేదు కానీ.. స్థానికులను మాత్రం హడలెత్తిస్తున్నారు. క్షుద్రపూజలతో కూడిన తవ్వకాలు జరుపుతూ… జనాలు బెంబేలెత్తిపోయేలా చేస్తున్నారు. లేటెస్ట్‌గా కరీంనగర్‌ జిల్లాలోని మొలంగూర్‌లో ఓ బ్యాచ్ దిగడం స్థానికంగా కలకలం రేపింది.

కరీంనగర్ జిల్లాలో ఉన్న ఈ మొలంగూర్ ఖిల్లా ఒక చారిత్రక వారసత్వ సంపద..! శత్రు సైన్యం నుంచి తప్పించుకునేందుకు ఓ రక్షణ కవచంలా అప్పట్లో కాకతీయులు ఈ కోటను నిర్మించారు. అలాంటి చరిత్ర ఉన్న ఈ కోట ఇప్పుడు గుప్త నిధుల తవ్వకాలకు కేరాఫ్‌గా మారింది. కాకతీయులు తిరిగిన ప్రాంతం కావడం.. అత్యంత విలువైన వస్తువులు దొరుకుతాయన్న ప్రచారమూ జోరుగా సాగుతుండటంతో ఎక్కడ చూడు భారీ గోతులే కనిపిస్తున్నాయి.

గుప్తనిధుల కోసం లేటెస్ట్‌గా ఓ ఆరు నుంచి ఏడడుగుల గుంత తవ్వడం స్థానికంగా కలకలం రేపింది. గుంత చుట్టూ అరుదైన బండ రాయి ఉండటం.. ఆ బండరాయిని సైతం తొలగించి తవ్వకాలు జరపడంతో స్థానికులే ఆశ్చర్యపోతున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం తవ్వకాలు జరపడమే కాదు.. కచ్చితంగా విలువైన వస్తువులు దొరికే ఉంటాయనని కూడా చెబుతున్నారు. అద్భుత చరిత్ర ఉన్న ఈ కోట ఇప్పుడు ఇలాంటి పరిస్థితికి రావడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో అర్ధరాత్రులు వచ్చి పూజలు చేస్తూ.. గుప్తనిధుల కోసం తవ్వకాలు జరపుతుండటంతో భయపడుతున్నారు. ఇంతా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురాతన ఖిల్లాను కాపాడాలని ప్రజాప్రతినిధులకు సైతం విన్నవించుకున్నా ఫలితం శూన్యమని వాపోయారు.

మొత్తంగా… ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి మొలంగూర్ ఖిల్లాను కాపాడాలన్న డిమాండ్ స్థానికుల నుంచి బలంగా వినిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us