AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CTET Results 2026: సీటెట్‌ ఫిబ్రవరి 2026 ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డు డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

సీటెట్ ఫిబ్రవరి 2026 ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సోమవారం (మార్చి 30) రాత్రి అధికారికంగా విడుదల చేసింది. సీటెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రోల్ నంబర్ నమోదు చేసి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం..

CTET Results 2026: సీటెట్‌ ఫిబ్రవరి 2026 ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డు డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
CBSE CTET results
Srilakshmi C
|

Updated on: Mar 31, 2026 | 5:59 AM

Share

హైదరాబాద్‌, మార్చి 31: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) ఫిబ్రవరి 2026 ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సోమవారం (మార్చి 30) రాత్రి అధికారికంగా విడుదల చేసింది. సీటెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రోల్ నంబర్ నమోదు చేసి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని విద్యా సంస్థల్లో టీచర్‌ కొలువులు చేపట్టేందుకు యేటా రెండు సార్లు సీబీఎస్సీ సీటెట్‌ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అర్హత ఆధారంగా కేంద్ర విద్యాలయాలు (KVS), నవోదయ విద్యాలయాలు (NVS) సహా ఇతర కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా కొలువు దక్కించుకోవచ్చు. సీటెట్‌లో అర్హత సాధిస్తేనే వారు టీచర్ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత సాధిస్తారన్నమాట.

సీటెట్‌ ఫిబ్రవరి 2026 ఫలితాల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే అభ్యర్థులకు లైఫ్ టైమ్ వాలిడిటీ కింద సర్టిఫికెట్లు జారీ చేస్తారు. అంటే సీటెట్‌ సర్టిఫికెట్‌ జీవితకాలం చెల్లుబాటు అవుతుందన్నమాట. క్వాలిఫై అయిన అభ్యర్థుల డిజిటల్ మార్క్‌షీట్లు, సర్టిఫికెట్లను CBSE ‘డిజిలాకర్’ ద్వారా కూడా అందుబాటులో ఉంచుతుంది. అలాగే ఈ పరీక్ష రాయడానికి ప్రయత్నాల సంఖ్యపై ఎటువంటి పరిమితి లేదు. అభ్యర్థులు తమ స్కోరును మెరుగుపరుచుకోవడానికి ఎన్నిసార్లయినా ఈ పరీక్ష రాయవచ్చు.

ఇవి కూడా చదవండి

సీటెట్‌ ఫిబ్రవరి 2026 ఫలితాల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాగా సీటెట్‌ 206 పరీక్ష దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 7, 8 తేదీల్లో మొత్తం 140 నగరాల్లో ఆన్‌లైన్‌ విధానంలో జరిగింది. ఈ పరీక్షలో అర్హత సాధించడానికి సీబీఎస్‌ఈ కేటగిరీల వారీగా కనీస మార్కులను నిర్ణయించింది. ఇందులో ఎలాంటి ‘మెరిట్ లిస్ట్’ ఉండదు. కేవలం అర్హత మార్కులు సాధిస్తే సరిపోతుంది. మొత్తం 150 మార్కులకు నిర్వహించే సీటెట్‌ పరీక్షలో జనరల్ అభ్యర్థులకు 60% (150 90 మార్కులు), ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు 55% (82 మార్కులు) సాధిస్తే అర్హత లభిస్తుంది.

సీటెట్‌ ఫిబ్రవరి 2026 ఫలితాల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us