Karimanagar: వేషం కట్టి ఊరంతా తిరుగుతున్నాడు.. ఎందుకో తెలుసా…?
పల్లె–పట్నం అన్న తేడా లేకుండా కోతుల బెడద పెరిగిపోతోంది. అడవులు క్షీణించడంతో ఆహారం కోసం కోతులు జనావాసాలకే చేరి ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. వాటికి చెక్ పెట్టేందుకు.. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో మాత్రం ఒక హోటల్ యజమాని ఈ సమస్యకు వినూత్న మార్గం కనుగొన్నాడు.

పల్లె…పట్నం తేడా లేదు..ఎక్కడ చూసినా కోతుల బెడద ఉంది. అడవులు అంతరించిపోవడంతో కోతులన్నీ జనావాసాల్లోకి వస్తున్నాయి. అడవుల్లో కోతులకి ఆహారం పుష్టిగా లభించేది. ఇప్పుడు అడవులు అంతరించిపోవడంతో కోతులకు ఆహారం అనేది లభించడం లేదు.. దీంతో.. కోతులు మొత్తం గ్రామాల్లోకి వచ్చి బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఎక్కడికి పడితే అక్కడికి వచ్చి ఆహారం కోసం యుద్ధం చేస్తున్నాయి.
కోతుల బెడదకు చెక్ పెట్టేందుకు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఒక హోటల్ యాజమాని వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. మండల కేంద్రంలో హోటల్ నిర్వహించే బిక్షపతి హోటల్లో ఏమి వంట వండినా.. ఏం చేసినా కూడా కోతులు గుంపులు గుంపులుగా వచ్చి దాడులు చేసి ఆహారాన్ని ఎత్తుకుపోతున్నాయి. అక్కడికి వచ్చిన కస్టమర్లను తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయి. కోతుల బెడద పెరిగింది. దీంతో వాటి బారి నుంచి తన వ్యాపారాన్ని కాపాడుకునేందుకు.. గొరిల్లా వేషం కట్టాడు. గొరిల్లా డ్రెస్ వేసుకుని ఇంటి నుంచి బయటికి రాగానే కోతులు పరుగులు తీస్తున్నాయి. నిజమైన గొరిల్లానే వచ్చిందని భావించి ఆ ప్రాంతవైపు రావడం మానేస్తున్నాయి. ఇది చూసిన చాలామంది సూపర్ ప్లాన్ చేశావ్ అంటూ హోటల్ యజమానిని అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ హోటల్ యజమాని మాట్లాడుతూ విపరీతమైన కోతల బెడద భరించలేక ఈ డ్రెస్సును కొనుగోలు చేసి ధరించి కోతుల వెంట పడుతున్నానని అంటున్నారు. తనకు మరికొందరు తోడై ఇలా చేస్తే… కోతులను గ్రామం నుంచి తరిమికొట్టవచ్చు అని హోటల్ యజమాని చెబుతున్నాడు.
