Hyderabad: మట్టి వినాయకులను పూజించండి.. పర్యావరణాన్ని కాపాడండి.. ఉచితంగా విగ్రహాల పంపిణీ.. ఎక్కడెక్కడంటే

హెచ్‌ఎండీఏ, గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) సహకారంతో నగరంలోని రీజనల్ సర్కిళ్లలో ఈ మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. 2017 నుంచి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రతి ఏడాది మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తుంది.

Hyderabad: మట్టి వినాయకులను పూజించండి.. పర్యావరణాన్ని కాపాడండి.. ఉచితంగా విగ్రహాల పంపిణీ.. ఎక్కడెక్కడంటే
Clay Ganesha

Edited By: Surya Kala

Updated on: Aug 23, 2025 | 7:42 PM

హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) 2017 నుంచి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రతి ఏడాది మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఈ ఏడాది, 24 నుండి 26 ఆగస్టు వరకు.. సుమారు లక్ష వినాయక ప్రతిమలు పంపిణీ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.

పంపిణీ కేంద్రాలు:

శిల్పారామం (హైటెక్ సిటీ)

మెట్రో క్యాష్ అండ్ క్యారీ (కూకట్‌పల్లి)

ఇవి కూడా చదవండి

శిల్పారామం (ఉప్పల్)

ఆరోగ్యశ్రీ కార్యాలయం

సైలెంట్ వ్యాలీ హిల్స్ (జూబ్లీహిల్స్)

ఐఏఎస్ క్యార్టర్స్ (బంజారాహిల్స్)

కేబీఆర్ పార్కు (ప్రవేశ ద్వారం)

హిందూ పత్రిక కార్యాలయం

ఎన్‌టీఆర్ గార్డెన్

ప్రియదర్శిని పార్కు (సరూర్‌నగర్)

రాజీవ్ గాంధీ పార్కు (వనస్థలిపురం)

కుందన్‌బాగ్

ఐఏఎస్ కాలనీ (బేగంపేట)

దుర్గంచెరువు పార్కు (ప్రవేశ ద్వారం)

వేదిక్ ధర్మ ప్రకాశ్ స్కూల్ (పాతబస్తీ)

గ్రీన్‌ల్యాండ్స్ (బేగంపేట)

ప్రెస్ క్లబ్ (సోమాజిగూడ)

ఎల్లమ్మ దేవాలయం (బల్కంపేట)

టూప్స్ రెస్టారెంట్ (జూబ్లీహిల్స్)

పెద్దమ్మ టెంపుల్ (జూబ్లీహిల్స్)

రైతు బజార్ (మెహిదీపట్నం)

గణేశ్ టెంపుల్ (సికింద్రాబాద్)

హెచ్‌ఎండీఏ కార్యాలయం (అమీర్‌పేట)

భారతీయ విద్యాభవన్ (సైనిక్‌పురి)

వాయుపురి రీక్రేషన్ సెంటర్

సఫిల్‌గూడ పార్కు

మైండ్‌ స్పేస్ (మాదాపూర్)

మైహోం నవదీప (మాదాపూర్)

తార్నాక కమర్షియల్ కాంప్లెక్స్

ఇందూ అరణ్య (బండ్లగూడ)

మొబైల్ వ్యాను ద్వారా పంపిణీ:

రాంకీ టవర్స్ (మాదాపూర్)

మలేషియా టౌన్‌షిప్ (కేపీహెచ్‌బీ)

ఎస్‌ఎంఆర్ వినయ్ (మియాపూర్)

మైహోం జ్యువెల్ పైప్‌లైన్ రోడ్డు (మియాపూర్)

ఇందూ పార్చూన్ (కూకట్‌పల్లి)

వివిధ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు

హెచ్‌జీసీఎల్ కార్యాలయం (నానక్‌రాంగూడ)

పంపిణీ వివరాలు కోసం.. కె. శంకర్ (ఈఈ) – 9849909845, జె. గణేష్ (డిప్యూటీ ఈఈ) – 7989371104 ను సంప్రదించవచ్చు.

హెచ్‌ఎండీఏ, గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) సహకారంతో నగరంలోని రీజనల్ సర్కిళ్లలో ఈ మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. హెచ్‌ఎండీఏ సుమారు లక్ష విగ్రహాలను, జీహెచ్‌ఎంసీ రెండు లక్షల మట్టి ప్రతిమలను నగరంలోని వార్డు కార్యాలయాల్లో పంపిణీ చేస్తోంది.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..