Keslapur jathara: నాగోబా ఆలయాన్ని దర్శించుకున్న గవర్నర్ బండారు దత్తాత్రేయ.. ఘనస్వాగత పలికిన మెస్రం వంశీయులు..
Nagoba Jatara: ఆదిలాబాద్‌లోని కేస్లాపూర్ నాగోబా ఆలయానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేరుకున్నారు.
Nagoba Jathara: ఆదిలాబాద్‌లోని కేస్లాపూర్ నాగోబా ఆలయానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేరుకున్నారు. ఆలయంలోని నాగదేవతలను దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, ఆలయానికి చేరుకున్న సందర్భంగా మెస్త్రం వంశీయులు గవర్నర్ దత్తాత్రేయకు ఆదివాసీ సంప్రదాయాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఇదే సమయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఆయనకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సోయం బాపూరావు, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ విష్ణు వారియర్ పాల్గొన్నారు.
కాగా, ఆదివాసీల అతిపెద్ద జాతరైన కేస్లాపూర్ నాగోబా జాతర గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. మెస్రం వంశీయులు నాగదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక వారం రోజుల పాటు జరిగే ఈ జాతరకు మెస్రం వంశీయులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. భక్తుల భారీగా వస్తుండగటంతో ఆ ప్రాంతం అంతా కిటకిటలాడుతోంది.
Also read: