AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్.. మూడ్రోజుల పాటు వర్షాలు..

తెలంగాణలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి. రానున్న రోజుల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కొనసాగే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు వెదర్ బులిటెన్ విడుదల చేసింది. వర్షసూచన ఎలా ఉందంటే..

Telangana: తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్.. మూడ్రోజుల పాటు వర్షాలు..
Rains
Venkatrao Lella
|

Updated on: Jul 07, 2026 | 3:07 PM

Share

నైరుతి రుతుపవనాలు జూలై 7న ఉత్తర అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, గుజరాత్‌లోని మిగిలిన ప్రాంతాలకు, రాజస్థాన్, హర్యానాలోని మరికొన్ని ప్రాంతాలకు మరింత ముందుకు విస్తరించాయి. రాబోయే 2-3 రోజులలో నైరుతి రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, రాజస్థాన్, హర్యానా, పంజాబ్‌లలోని మిగిలిన ప్రాంతాలకు, తద్వారా దేశమంతటా మరింత ముందుకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఉత్తర ఛత్తీస్‌గఢ్, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ ఉత్తరప్రదేశ్, ఈశాన్య మధ్యప్రదేశ్ ప్రాంతాలపై ఉన్న వాయుగుండం బలహీనపడింది. జులై 7న ఉదయం 05:30 గంటల సమయానికి తూర్పు మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాలపై స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా మారింది.  తూర్పు మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఈ స్పష్టమైన అల్పపీడన ప్రాంతం ఈరోజు ఉదయం 08:30 గంటల సమయానికి అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టానికి 9.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణ దిశగా వంగి ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా మధ్యప్రదేశ్, నైరుతి ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల గుండా నెమ్మదిగా కదులుతూ మరింత బలహీనపడే అవకాశం ఉంది.

మూడ్రోజుల పాటు వర్షసూచన

వీటి ప్రభావంతో రాబోయే మూడ్రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 నుండి 60 కి.మీ. వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే తెలంగాణలో పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలో మోస్తరు వానలు పడుతున్నాయి. రానున్న మూడ్రోజలు పాటు వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశముందని తెలుస్తోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. పలు చోట్ల పిడుగులు పడే అవకాశముందని, ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండవద్దని హెచ్చరిస్తున్నారు.

ఏపీలో ఎల్‌నివో ప్రభావం

నైరుతి రుతుపవనాలు, ఎల్-నినో ప్రభావంపై ఉన్నత స్థాయి అధికారులతో హోం మంత్రి అనిత మంగళవారం సమీక్ష నిర్వహించారు. విపత్తుల ప్రభావాన్ని తగ్గించేలా సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విపత్తుల వలన ఏ ఒక్క ప్రాణనష్టం జరగకుండా చూడటమే లక్ష్యం అని అన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో నిరంతరం పనిచేసేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు చేయాలని, రాయలసీమ జిల్లాలపై ఎక్కువగా ఎల్ నినో ప్రభావం ఉందని అన్నారు. శ్రీసత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో తీవ్రస్థాయిలో వర్షాల కొరత ఉందని, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, కడప జిల్లాల్లో మధ్యస్థంగా వర్షభావ ప్రభావం ఉండదని తెలిపారు. ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మధ్యస్థంగా వర్షభావ ప్రభావం ఉంటుందని, కరువు ముప్పు ఉన్న మండలాల్లో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపునకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

Follow Us