Rains in Hyderabad: భాగ్యనగరంలో ఓ వైపు బోనాల సందడి మొదలైంది. హైదరాబాద్ సహా తెలంగాణాలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి వర్షం పడుతోంది.హైదరాబాద్ లో ఆదివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం నుంచి భారీ వర్షంగా మారింది, సికింద్రాబాద్ , కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట్, ప్రగతినగర్, బాచుపల్లి, బాలానగర్, చింతల్, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, కుత్బుల్లాపూర్, మాదాపూర్, కొండాపూర్, మణికొండ, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు ఏరులైపారుతుంది.
రుతుపవనాల ప్రభావంతో గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్బపీడన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు నమోదవుతున్నాయని హైదరబాద్ వాతావరణ శాఖ తెలిపింది.దీని ప్రభావంతో ఈ నెల 13వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ క్రమంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Also Read: నేడే రోదసిలోకి తెలుగమ్మాయి శిరీష.. 90 నిమిషాల ప్రయాణం.. ఇంట్రస్టింగ్ విషయాలు