AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అల్పపీడనం అలెర్ట్.. తెలంగాణకు అతిభారీ రెయిన్ అలెర్ట్.. ముఖ్యంగా ఈ జిల్లాలకు

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో ఈనెల 26 వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయి. అటు ఏపీలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సూచించింది. హైదరాబాద్‌లో ఆగని వాన.. ఉదయం 6 నుంచే పలుచోట్ల ఇంకా వర్షం కురుస్తూనే ఉంది.

Hyderabad: అల్పపీడనం అలెర్ట్.. తెలంగాణకు అతిభారీ రెయిన్ అలెర్ట్.. ముఖ్యంగా ఈ జిల్లాలకు
Rain Alert
Ravi Kiran
|

Updated on: Jul 23, 2025 | 9:34 AM

Share

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రసరణ మరియు ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయి.. దీని ప్రభావం గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కాకినాడ, అల్లూరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, మరియు గోదావరి జిల్లాలపై పడింది. జూలై 24 వరకు ఉరుములతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అటు తెలంగాణలో ఈనెల 26 వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నాలుగు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ , పెద్దపల్లి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ఆరు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్, మరో 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఇప్పటికే హైదరాబాద్‌లో ఉదయం 6 నుంచే పలుచోట్ల ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది.

మరోవైపు ఏపీలో ఎన్టీఆర్ జిల్లా రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి మైలవరంలో వాగులూ, వంకలూ ప్రవాహిస్తున్నాయి. మైలవరంలోని సూరిబాబు పేట, బాలయోగి నగర్ ప్రాంతాలకు వెళ్ళే రహదారులు కొండవాగు ఉదృతి పెరగడంతో జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రథాన రహదారిపై నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారాయి. అలాగే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురంలో 22.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. యాకన్నగూడెం దగ్గర తాత్కాలిక రోడ్డు తెగిపోయింది. దీంతో వెంకటాపురం, భద్రాచలం మధ్య రాకపోకలు బంద్‌ అయ్యాయి. తాడ్వాయి-ఏటూరునాగారం మధ్య హైవేపై చెట్లు విరిగిపడ్డాయి. అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క ఆదేశించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జూనియర్ బాక్సర్‌తో మేరీ కోమ్‌కు ఎఫైర్.. మాజీ భర్త సంచలన ఆరోపణలు
జూనియర్ బాక్సర్‌తో మేరీ కోమ్‌కు ఎఫైర్.. మాజీ భర్త సంచలన ఆరోపణలు
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాలిటెక్నిక్‌లో 9 కొత్త కోర్సులు!
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాలిటెక్నిక్‌లో 9 కొత్త కోర్సులు!
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ...అంతకు మించి అంటున్న ఆడియన్స్
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ...అంతకు మించి అంటున్న ఆడియన్స్
చికెన్‌లోని ఈ పార్ట్స్ యమ స్పెషల్.. తిన్నారంటే ఆ రోగాల మాటే ఉండదు
చికెన్‌లోని ఈ పార్ట్స్ యమ స్పెషల్.. తిన్నారంటే ఆ రోగాల మాటే ఉండదు
మురుగు కాలువను క్లీన్ చేస్తున్న కార్మికులు.. కాళ్ల కింద కనిపించిన
మురుగు కాలువను క్లీన్ చేస్తున్న కార్మికులు.. కాళ్ల కింద కనిపించిన
క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లను ఎలా రీడీమ్ చేసుకోవాలి?
క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లను ఎలా రీడీమ్ చేసుకోవాలి?
ఆర్థిక ఇబ్బందులను దూదిలా ఊదేయండి.. ఈజీ టిప్స్
ఆర్థిక ఇబ్బందులను దూదిలా ఊదేయండి.. ఈజీ టిప్స్
నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్‌... మెగాస్టార్‌కి ఊరట!
నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్‌... మెగాస్టార్‌కి ఊరట!
వామ్మో.. షుగర్ వల్ల దేశంలో ఇన్ని లక్షల కోట్ల నష్టమా.. డాక్టర్లు..
వామ్మో.. షుగర్ వల్ల దేశంలో ఇన్ని లక్షల కోట్ల నష్టమా.. డాక్టర్లు..
హోంగార్డ్ సర్వీసుల్లోకి ట్రాన్స్ జెండర్స్.. నియామక పత్రాలు అందజేత
హోంగార్డ్ సర్వీసుల్లోకి ట్రాన్స్ జెండర్స్.. నియామక పత్రాలు అందజేత