మామూలుగా లేదుగా.. కుక్క పిల్లకు బారసాల వేడుక.. పేరు పెట్టి నోరూరించే విందు భోజనం..!
వారికి పెంపుడు కుక్క అంటే ప్రేమ.. కుటుంబ సభ్యురాలిగానే చూసుకుంటున్నారు. అంతేకాకుండా నాలుగేళ్లుగా అల్లారు, ముద్దుగా పెంచుకుంటున్నారు. ఇటీవల ఈ కుక్క ఏడు కూనలకు జన్మనిచ్చింది. దీంతో సంతోషం వ్యక్తం చేసిన దంపతులు బంధుమిత్రులందరినీ పిలిచి, బారసాల వేడుకను ఘనంగా నిర్వహించారు. అంతేకాందు రకరకాల విందు భోజనాలు ఏర్పాటు చేశారు.

ఆ ఇల్లుని అందంగా అలంకరించారు.. బంధు మిత్రులందరికీ పిలిచి గ్రాండ్ గా విందు భోజనం ఏర్పాటు చేశారు. పండగ వాతావరణం చూసి ఆ ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతుందని అంతా భావించారు. నిజమే అది శుభకార్యమే . బారసాల (పురుడు) మహోత్సవం. కానీ, లూసీ పురుడు కార్యక్రమాన్ని ఏ లోటు రాకుండా ఘనంగా నిర్వహించారు. ఇంతకీ లూసీ అంటే ఎవరో తెలుసా..? ఆ ఇంటి యజమాని అల్లారుముద్దుగా పెంచుకున్న శునకం..!
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మాణిక్ బండారులో శునకానికి బారసాల నిర్వహించింది ఒక కుటుంబం. ఏదో ఆషామాషీగా కాదు. ఎంతో ఘనంగా సాంప్రదాయబద్ధంగా అచ్చం మనుషుల పురుడు కార్యక్రమానికి చేయవలసిన ఏర్పాట్లు అన్ని చేశారు. తాము ఎంతో ఇష్టంగా అల్లారుముద్దుగా పెంచుకుంటున్న లూసీ అనే శునకానికి పిల్లలు జన్మించడం పట్ల ఆ కుటుంబం ఉబ్బితబ్బిబ్బి అవుతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏడు పిల్లలకు జన్మనిచ్చింది లూసీ.. అందులో నాలుగు ఆడ శునకాలు కాగా మరో మూడు మగ శునకాలు ఉన్నాయి..
నర్సాగౌడ్, మంజుల దంపతులు గత నాలుగు ఏళ్ల క్రితం చిన్న కుక్క పిల్లను తెచ్చుకున్నారు. అది ఆడది కావడంతో లూసీ అని పేరు పెట్టారు. అచ్చం సొంత పిల్లల్లాగా లూసీని అలారుముద్దుగా పెంచుకుంటున్నారు. లూసీని తమ తమ కుటుంబ సభ్యుల్లో ఒకరుగా సమానంగా చూస్తూ వస్తున్నారు. ఇంకా ఇటీవల లూసీ గర్వం దాల్చి ఒకే కాన్పులో ఏడు కుక్క పిల్లలకు జన్మనిచ్చింది..
లూసీ వారి కుటుంబంలో ఒకరిలా ఉండిపోయింది. అందుకే తమ పిల్లలకు ఏ రకంగా అయితే చేస్తారో.. అదే స్థాయిలో లూసీకి ఘనంగా బారసాల నిర్వహించారు. లూసీ కి కూడా గ్రాండ్ గా పురుడు కార్యక్రమాన్ని జరిపించాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు.. కుటుంబ సభ్యులకు పిల్లలకు విషయాన్ని చెప్పారు. లూసీ తో ఆ కుటుంబ సభ్యులందరికీ ఉన్న అఫెక్షన్ అంతా ఇంత కాదు. అందుకే వాళ్ళు ఒకే చెప్పడమే కాదు సుదూర ప్రాంతాల్లో ఉన్నవారి బంధువులు కూడా ఈ ఫంక్షన్ కి అటెండ్ అయ్యారు. ఇరుగుపొరుగు బంధుమిత్రులు అందరినీ ఆహ్వానించారు. ఇంటిని చక్కగా ముస్తాబు చేశారు. లూసీ తోపాటు ఏడు చిన్న కుక్క పిల్లలను అలంకరించి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఫంక్షన్ లో లూసీ సంతోషానికి అవధులు లేనట్లుగా కనిపించింది. బారసాల కార్యక్రమము అనంత బంధుమిత్రులు విందు భోజనం చేసి, మరోసారి లూసీని పసికూనలను మనసారా ఆశీర్వదించి తిరుగుపయనమయ్యారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
