TSRTC Merger Bill: ఇకపై కార్మికులు కాదు.. ప్రభుత్వ ఉద్యోగులు.. ఆర్టీసీ సిబ్బందికి గుడ్ న్యూస్ చెప్పిన గవర్నర్..
TSRTC Merger Bill: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలోని కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చుతూ.. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆర్టీసీ బిల్లును గవర్నర్ తమిళిసైకి పంపించారు.

TSRTC Merger Bill: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలోని కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చుతూ.. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆర్టీసీ బిల్లును గవర్నర్ తమిళిసైకి పంపించారు. నెల రోజులుగా ఈ బిల్లుపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో ఆర్టీసీ బిల్లు అంశంపై న్యాయ పరిశీలన అనంతరం గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ గుడ్ న్యూస్ చెప్పారు. టీఎస్ ఆర్టీసీ విలీనం బిల్లుకు గురువారం గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. రాష్ట్రప్రభుత్వం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నెలరోజుల తర్వాత.. గవర్నర్ తమిళిసై ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చుతూ ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం తెలిపారు. గవర్నర్ న్యాయశాఖ పరిశీలన తర్వాత కొన్ని అంశాలపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రభుత్వ వివరణపై సంతృప్తి వ్యక్తంచేసిన గవర్నర్ తమిళిసై.. ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను గుర్తించే బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరారాజన్ ఆర్టీసీ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులు మారనున్న నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులకు గవర్నర్ అభినందనలు తెలిపారు.
కాగా.. ఆగస్టు 06వ తేదీన తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల వీలిన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఆర్టీసీ కార్మికుల బాధలను, సంస్థను పరిగణలోకి తీసుకుని.. ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఏ పని చేసినా కూడా ప్రభుత్వానికి బాధ్యత ఉంటుందని ఆర్టీసీ సంస్థను గాడిలో పెడతామని కేసీఆర్ అప్పట్లో ప్రకటించారు. ఇదిలాఉంటే.. ఆర్టీసీ విలీనం బిల్లును రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్పొరేషన్ ఆస్తులు యధాతథంగా ఉంటాయని తెలిపారు. అలాగే ఆర్టీసీ కార్మికుల బకాయిలను కూడా చెల్లిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్నటువంటి పీఆర్‌సీ ఇకనుంచి ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.
కాగా.. ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడం పట్ల ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఎట్టకేలకు గవర్నర్ ఆర్టీసీ విలీనం బిల్లుకు ఆమోదం తెలపడంతో దీనిపై ఇన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..