Tamilisai Soundararajan : 25 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా.. ప్రొటోకాల్ ఎలా పాటించాలో తెలుసు.. గవర్నర్ స్ట్రాంగ్ కౌంటర్..
ఖమ్మంలో బీఆర్ఎస్ నిర్వహించిన సభలో.. గవర్నర్ వ్యవస్థపై ముఖ్యమంత్రులు చేసిన కామెంట్స్ పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. గవర్నర్ ను అవమానించారని అన్నారు....
ఖమ్మంలో బీఆర్ఎస్ నిర్వహించిన సభలో.. గవర్నర్ వ్యవస్థపై ముఖ్యమంత్రులు చేసిన కామెంట్స్ పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. గవర్నర్ ను అవమానించారని అన్నారు. ముఖ్యమంత్రులుగా ఉండి గవర్నర్ వ్యవస్థలను ఎలా అవహేళన చేస్తారని నిలదీశారు. ప్రోటోకాల్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తానని చెప్పారు. తాను 25 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నానని, ప్రోటోకాల్ అంటే ఏమిటో తనకు తెలుసని అన్నారు. రిపబ్లిక్ డే అంశంపై ఇప్పటికీ ప్రభుత్వం నుంచి సమాచారం రాలేదన్న గవర్నర్.. గణతంత్ర దినోత్సవం, బడ్జెట్ సమావేశాలు రానున్నాయని.. ప్రభుత్వం తీరు మాత్రం దారుణంగా ఉందని గవర్నర్ విమర్శించారు.
పాతికేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా. ప్రొటోకాల్ ఎలా పాటించాలో నాకు తెలుసు. రిపబ్లిక్‌డే అంశంపై ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాకు సమాచారం లేదు. రాజ్యాంగ పదవిలో ఉండి రాజకీయాలు మాట్లాడను. మిగతా రాష్ట్రాల గురించి నేను మాట్లాడను. కానీ తెలంగాణ సర్కార్ ఎందుకు ప్రోటోకాల్ పాటించట్లేదో చెప్పాలి. గవర్నర్ అంటే కేసీఆర్ ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపు. గవర్నర్ వ్యవస్థను ఎలా హేళన చేస్తారు.
– తమిళిసై సౌందర రాజన్, తెలంగాణ గవర్నర్
కాగా.. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ మీటింగ్ లో రాష్ట్రాల గవర్నర్లు అమాయకులని ముఖ్యమంత్రులు అన్నారు. వారితో సీఎంలను ఇబ్బంది పెట్టిస్తున్నారని అనడం హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు గవర్నర్ సీఎం స్టాలిన్‌ను, తెలంగాణ గవర్నర్.. కేసీఆర్‌ను, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ ప్రభుత్వాన్ని, పంజాబ్ గవర్నర్.. మాన్‌ను ఇబ్బందిపెడుతున్నారని చెప్పారు. నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పెరుగుదల వంటి అంశాలు ప్రధానికి పట్టవని విమర్శించారు. ఏ ప్రభుత్వాన్ని కూల్చాలి, ఎమ్మెల్యేలను ఎలా కొనాలి లాంటి ఆలోచనలే చేస్తుంటారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం