Kanti Velugu: మొదటి రోజే 1.60 లక్షల మందికి కంటి పరీక్షలు.. కంటి వెలుగు కార్యక్రమానికి భారీ స్పందన
కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. కంటి చూపు సమస్య ఉన్న వారికి కళ్లజోళ్లు ఇచ్చారు. ఆపరేషన్లు అవసరమున్న వారికి ఆస్పత్రులకు రిఫర్ చేశారు. 18 సంవత్సరాలు దాటిన వారందరికీ పరీక్షలు..
తెలంగాణ వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు తెరుచుకున్నాయి. ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ప్రజలకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. కంటి చూపు సమస్య ఉన్న వారికి కళ్లజోళ్లు ఇచ్చారు. ఆపరేషన్లు అవసరమున్న వారికి ఆస్పత్రులకు రిఫర్ చేశారు. 18 సంవత్సరాలు దాటిన వారందరికీ పరీక్షలు నిర్వహిస్తాన్నారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 1500 క్యాంపులను ఏర్పాటు చేశారు. ఇందులో తొలి రోజే 1.60 లక్షల మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 37 వేల రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు. 33వేల మందికి ప్రిస్కిప్షన్ గ్లాసెస్ అవసరమని గుర్తించారు. ఇందులో 72,580 మంది పురుషులు, 87,889 మంది మహిళలు ఉన్నారు.
మొత్తం 37,046 రీడింగ్ గ్లాసులను పంపిణీ చేయగా, 33,221 మందిని ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం గుర్తించారు. స్క్రీనింగ్ చేయించుకున్న వారిలో 72,580 మంది పురుషులు, 87,889 మంది స్త్రీలు ఇద్దరు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో 522 శిబిరాలు నిర్వహించగా.. గ్రామీణ ప్రాంతాల్లో 978 స్క్రీనింగ్ క్యాంపులు జరిగాయి.
ఇదిలావుంటే, రాష్ట్రంలో ఒక్కరు కూడా కంటి సమస్యతో బాధ పడొద్దన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ జిల్లా రాయపర్తిలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ప్రజల అవసరాలు, ఆకాంక్ష మేరకే సీఎం కేసీఆర్ పనిచేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం