HYDRA: హైడ్రాకు పుల్ పర్మిషన్.. చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన గవర్నర్

హైడ్రాకు ఇక తిరుగులేదు. హైడ్రా కూల్చివేతలను ఇక ఎవరూ ఆపలేరు. హైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం.

HYDRA: హైడ్రాకు పుల్ పర్మిషన్.. చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన గవర్నర్
Hydra
Follow us

|

Updated on: Oct 05, 2024 | 9:15 PM

హైడ్రాకు ఇక తిరుగులేదు. హైడ్రా కూల్చివేతలను ఇక ఎవరూ ఆపలేరు. హైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం. హైడ్రాకు చట్టబద్ధతపై ఇటీవల కేబినెట్‌లో ఆమోదం తెలిపిన తెలంగాణ ప్రభుత్వం.. ఆర్డినెన్స్‌పై సంతకం కోసం రాజ్‌భవన్‌కి ఫైల్ పంపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం.

ఆర్డినెన్స్‌ పరిశీలించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. గవర్నర్‌ ఆమోదించడంతో హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదలైంది. అయితే హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ జీహెచ్ఎంసీ చట్టంలో కొత్తగా 374(బి) సెక్షన్ చేరుస్తున్నట్లుగా ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడేందుకు జీహెచ్ఎంసీ అధికారాలు హైడ్రాకు అప్పగించారు. జలాశయాలు, రోడ్లు, పార్కులు, ఇతర ఆస్తులను కాపాడే బాధ్యత అధికారి లేదా ఏజెన్సీకి అప్పగించే అధికారం ప్రభుత్వానికి కల్పిస్తూ ఆర్డినెన్సు జారీ చేశారు.

ఇదిలావుంటే, హైడ్రా కూల్చివేతలను వ్యతిరేకిస్తూ.. ఆ సంస్థ చట్టబద్ధతను ప్రశ్నిస్తూ న్యాయస్థానాల్లో అనేక పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఈ కారణంగా చట్టబద్దత కలిపించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేకంగా అసెంబ్లీని నిర్వహించి చట్టాన్ని ఆమోదించాలని అనుకున్నా.. అంత అవసరం లేదని ముందుగా ఆర్డినెన్స్ జారీ చేస్తే సరిపోతుందని నిర్ణయానికి వచ్చారు. ఆ మేరకు ఆర్డినెన్స్ తయారు చేసి గవర్నర్‌కు పంపారు. పరిశీలించిన గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో హైడ్రాకు పుల్ పర్మిషన్ వచ్చేసింది.

మరోవైపు శుక్రవారమే హైడ్రాకు తెలంగాణ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పాలి. హైడ్రా కూల్చివేతలు తక్షణమే ఆపాలని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ఇప్పటికిప్పుడు హైడ్రా కూల్చివేతలు ఆపలేమని స్పష్టం చేసింది. హైడ్రా, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది. తదుపరి విచారణ అక్టోబర్ 14 కి వాయిదా వేసింది. ఇప్పుడు చట్టబద్దత కల్పించినందున ఈ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

హైడ్రాకు పుల్ పవర్స్.. ఇక ఎవరూ ఆపలేరు..!
హైడ్రాకు పుల్ పవర్స్.. ఇక ఎవరూ ఆపలేరు..!
యూరిక్ యాసిడ్ పెరగిందా లేదా రక్త పరీక్ష లేకుండా ఎలా తెలుస్తుందంటే
యూరిక్ యాసిడ్ పెరగిందా లేదా రక్త పరీక్ష లేకుండా ఎలా తెలుస్తుందంటే
వాషింగ్ మెషీన్లపై భారీ ఆఫర్లు.. రూ. 15వేలకే టాప్ బ్రాండ్ మెషీన్లు
వాషింగ్ మెషీన్లపై భారీ ఆఫర్లు.. రూ. 15వేలకే టాప్ బ్రాండ్ మెషీన్లు
రూ. 30 వేలకే ఐఫోన్‌ 13.. వెంటనే త్వరపడండి.. ఈ ఆఫర్‌ మళ్లీ రాదు
రూ. 30 వేలకే ఐఫోన్‌ 13.. వెంటనే త్వరపడండి.. ఈ ఆఫర్‌ మళ్లీ రాదు
దేవగట్టు కర్రల సంబరాలకు సర్వం సిద్ధం.. పోలీసులు భారీ బందోబస్తు
దేవగట్టు కర్రల సంబరాలకు సర్వం సిద్ధం.. పోలీసులు భారీ బందోబస్తు
ఒకే రోజు ప్రమాదానికి గురైన నలుగురు చిన్నారులు
ఒకే రోజు ప్రమాదానికి గురైన నలుగురు చిన్నారులు
పైల్స్‌తో నరకం చూస్తున్నారా.? ఇలా చేస్తే వారం రోజుల్లోనే రిజల్ట్‌
పైల్స్‌తో నరకం చూస్తున్నారా.? ఇలా చేస్తే వారం రోజుల్లోనే రిజల్ట్‌
భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. టమోటా కిలో ఎంత ఉందో తెలుసా..?
భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. టమోటా కిలో ఎంత ఉందో తెలుసా..?
షార్ట్ బ్రేక్ ఇచ్చిన లారెన్స్‌.! అదిరిపోయే ప్లాన్ రెడీ..
షార్ట్ బ్రేక్ ఇచ్చిన లారెన్స్‌.! అదిరిపోయే ప్లాన్ రెడీ..
హ్యూందాయ్ పండుగ ఆఫర్లు షురూ.. నమ్మలేని తగ్గింపులు మీ సొంతం
హ్యూందాయ్ పండుగ ఆఫర్లు షురూ.. నమ్మలేని తగ్గింపులు మీ సొంతం
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..