బాధ్యతను విస్మరించిన బడి పంతులు..స్కూల్ లో సెల్ ఫోన్‌తో కుస్తీలు..!

| Edited By: Jyothi Gadda

Oct 01, 2024 | 11:36 AM

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయుడీని సస్పెండ్ చేశారు డిఇఓ. పాఠశాలలో సెల్ ఫోన్ చూస్తూ టైంపాస్ చేసిన స్కూల్‌ టీచర్‌ నిర్వాకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సంబంధిత అధికారులు స్పందించారు. కలెక్టర్ ఆదేశాలతో ఉపాధ్యాయుడు చందులాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

బాధ్యతను విస్మరించిన బడి పంతులు..స్కూల్ లో సెల్ ఫోన్‌తో కుస్తీలు..!
School Teacher
Follow us on

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల విద్యాశాఖ అధికారులు జారి చేసిన ఓ సర్కిలర్ ఉపాధ్యాయులను బెంబేలెత్తిస్తుంది. ఇటీవల అశ్వరావుపేట నియోజకవర్గంలో పాఠశాలలో తనిఖీలకు వెళ్లిన స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ కు విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు సెల్‌ఫోన్‌ మాట్లాడుతుండడం కనిపించింది. దీంతో ఉపాధ్యాయుల తీరుపై ఆయన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు ఫిర్యాదు చేయడంతో స్కూళ్లలో టీచర్లు సెల్ ఫోన్స్ ఉపయోగించకూడదంటూ 10 రోజుల క్రితం ఓ సర్కిలర్‌ని జారీ చేశారు విద్యాశాఖ ఉన్నతాధికారులు. ఇదే విషయమై ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. అయినప్పటికీ స్కూల్‌ టీచర్ల తీరులో ఎలాంటి మార్పు రాలేదు.

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

తాజాగా, కరకగూడెం మండలంలోని శ్రీరంగాపురం మండల ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహించే చందులాల్ అనే ఉపాధ్యాయుడు స్కూల్ టైం లో పిల్లల మధ్యలో కూర్చొని సెల్ఫోన్ చూస్తూ టైంపాస్ చేస్తుండడం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారి రంగంలోకి దిగారు. పాఠశాల లో పిల్లలకు పాఠాలు చెప్పకుండా నిర్లక్ష్యం వహిస్తూ సెల్‌ఫోన్‌ వాడడం పట్ల అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకున్నారు. ఉపాధ్యాయుడు చందులాలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

ప్రస్తుతం ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పాఠశాలల్లో సెల్‌ఫోన్‌ వాడకం శాపంలా మారడంతో టీచర్లంతా బెంబేలెత్తిపోతున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..