Telangana: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఆగస్టులో ఉచిత బియ్యం పంపిణీ.. వివరాలివే..

|

Aug 01, 2022 | 6:12 PM

ఏప్రిల్, మే నెలల్లో ఫ్రీగా పంపిణీ చేయని కారణంగా.. జులై నెలలో ఒక్కొక్కరికి10 కిలోల బియ్యం పంపిణీ చేశారు. ఇక తాజాగా, ఈ నెలలో ఒక్కొక్కరికి 15 కిలోల బియ్యాన్ని ఫ్రీగా పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Telangana: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఆగస్టులో ఉచిత బియ్యం పంపిణీ.. వివరాలివే..
Ration Distribution Ranking
Follow us on

Rice Cardholders: రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఈ నెల అంటే ఆగస్టులో ఒక్కొక్కరికి 15 కేజీల బియ్యం చొప్పున ఉచితంగా పంపిణీ చేయనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆగస్టు 4 నుంచి కార్డుదారులకు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. కాగా, కోవిడ్ సంక్షోభంలో అంటే ఏప్రిల్, మే నెలల్లో రేషన్ కార్డు కలిగిన ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కేటాయించినా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆకోటాను ప్రజలకు అందించలేదు. ఇదేకాక, రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు అందించే మరో 5 కేజీల బియ్యాన్ని ఉచితంగా అందివ్వకుండా, కిలోకి రూపాయి చొప్పున 6 కిలోలు అందించింది. జూన్‌ నెలలోనూ ఇలానే పంపిణీ చేసింది. అయితే, అదే నెలలో 23వ తేదీ నుంచి 5 కిలోల ఉచిత బియ్యాన్ని పంపిణీ చేసి ఆశ్చర్యానికి గురి చేసింది.