Telangana: మురికి కూపంగా మారుతున్న గోదారమ్మ.. సమస్యల్లో స్థానికులు

ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండే.. గోదావరి మురికిమయంగా మారింది. గతంలో ఈ నీళ్లు తాగుతే .. సర్వ రోగాలు తగ్గుతాయనే నమ్మకం. అంతేకాదు ఈ నది ఒడిలో పవిత్ర స్నానాలు చేసేవారు. ఇప్పుడు ఈ నీళ్లు తాగుతే సర్వరోగాలు వస్తున్నాయి. సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో కలుషితం మరి ఎక్కువగా ఉంది. క్లోరినేషన్ లేకుండా.. నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే కలుషితమవుతున్న గోదావరి నది గురించి తెలుసుకుందాం. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని అది పెద్ద పారిశ్రామిక ప్రాంతం.

Telangana: మురికి కూపంగా మారుతున్న గోదారమ్మ.. సమస్యల్లో స్థానికులు
Godavari River

Edited By:

Updated on: Sep 07, 2023 | 1:58 PM

ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండే.. గోదావరి మురికిమయంగా మారింది. గతంలో ఈ నీళ్లు తాగుతే .. సర్వ రోగాలు తగ్గుతాయనే నమ్మకం. అంతేకాదు ఈ నది ఒడిలో పవిత్ర స్నానాలు చేసేవారు. ఇప్పుడు ఈ నీళ్లు తాగుతే సర్వరోగాలు వస్తున్నాయి. సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో కలుషితం మరి ఎక్కువగా ఉంది. క్లోరినేషన్ లేకుండా.. నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే కలుషితమవుతున్న గోదావరి నది గురించి తెలుసుకుందాం. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని అది పెద్ద పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడ సుమారుగా 13 వేయిలకు పైగా కార్మికులు పని చేస్తున్నారు. 5 భూగర్భ గనులు, 4 ఓసిపిలు ఉన్నాయి. సింగరేణి కార్మికులతో పాటు.. ఎన్టీపీసీ ఉద్యోగులు ఉన్నారు. దాదాపుగా..3 లక్షలకు పైగా జనాభా ఉంటుంది. రామగుండంలే గోదావరి నది ప్రవహిస్తోంది. గోదావరి నది ఆధారంగానే… తాగు నీటిని సరఫరా చేస్తున్నారు. కొంత కార్పొరేషన్, మరి కొంత సింగరేణి సంస్థ తాగు నీటిని సరఫరా చేస్తుంది.

గోదావరి ఖని డ్రైనేజీతో పాటు, ఇతర వ్యర్థపదార్థాలు మొత్తం ఈ నదిలో కలుస్తుంది. వివిధ రకాల కేమికల్స్ ఈ నదిని కలుషితం చేస్తున్నాయి. నది సమీపం నుంచి వెళ్తేనే దుర్వాసన వస్తుంది. అంతేకాకుండా.. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ తో బ్యాక్ వాటర్ ఎప్పటికీ ఉంటుంది. నది ముందుకు ప్రవహించడం లేదు. డ్రైనేజీ ఈ ప్రాంతంలో… కలిసిపోతుంది. ఇప్పుడు వర్షాకాలంలో మరింత ఇబ్బందిగా ఉంటుంది. సింగరేణి పంప్ హౌజ్ నుంచి 17 వేల ఇళ్లకు తాగు నీటిని అందిస్తున్నారు. కానీ- క్లోరినేషన్ లేకుండా. నేరుగా ప్రెస్ లైన్ ద్వారా వీటిని సరఫరా చేస్తున్నారు. ఈ నీరు నేరుగా నల్లాల ద్వారా పట్టుకుంటున్నారు. మునిసిపాలిటీ నుంచి వచ్చే నీటిని క్లోరినేషన్ చేస్తున్నారు. కాస్తా తెల్లగా కనబడుతున్నాయి. గతంలో డ్రైనేజీ కలిసే ప్రాంతంలో శుద్ధి చేసే ప్లాంట్‎ను ఏర్పాటు చేశారు. కొన్ని రోజులు… ఇక్కడ డ్రైనేజీ నీరు శుద్ధి చేసిన తరువాత.. గోదావరి నదిలో కలిపేది.. అప్పుడు, గోదావరి నది కలుషితం కాలేదు.

అయితే ఈ శుద్ది చేసే ప్లాంట్ ఇప్పుడు మూలకు పడింది. దీంతో నేరుగా డ్రైనేజీ నీటితో పాటు ఇతర వ్యర్థపదార్థాలు, చెత్త, చెదారం, ప్లాస్టిక్, ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థపదార్థాలు కలుస్తున్నాయి. ఇప్పటికే. సింగరేణిలో కాలుష్యంతో సతమతమవుతుంటే… ఈ తాగు నీరు కలుషితం కావడంతో జనం మరింత అనారోగ్యానికి గురవుతున్నారు. వర్షాకాలం సీజన్లో వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. కలుషిత నీరు కారణంగా వాంతులు, విరేచనాల కేసులు పెరిగిపోయాయి. అంతేకాదు లివర్ సమస్యలు పెరిగిపోయాయని డాక్టర్లు చెబుతున్నారు. కెమికల్స్ వాటర్ కారణంగా భయంకరమైన క్యాన్సర్ సోకుతుంది. లివర్ క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారు. ఇక్కడ చాలా మంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. చిన్నారులు గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నీటి కారణంగా జలుబు, దగ్గు వస్తోంది. రోజు రోజుకు క్యాన్సర్ రోగుల సంఖ్య పెరిగిపోవడంతో డాక్టర్లు షాక్‌కు గురవుతున్నారు.

ఇవి కూడా చదవండి

చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్ద వారి వరకు అనారోగ్యంతో మంచం పడుతున్నారు. ఇదే విధంగా కలుషిత నీరు తాగుతే.. క్యాన్సర్ మరింత ప్రమాదకరంగే మారే అవకాశాలు ఉన్నాయి. డాక్టర్లు కూడా పలు పరిశోధనలు చేస్తున్నారు. అంతేకాదు.. కిడ్నీ సంబంధిత వ్యాధి గ్రస్తులు పెరిగిపోతున్నారు. డయాలసిస్ పేషెంట్లు పెరిగిపోతున్నారు. ఈ తాగు నీరు ప్రజల ప్రాణాలు తీస్తుంది. ఎంతో మంది జీతాల్లో వెలుగులు నింపుతున్న సింగరేణి కార్మికుల జీవితాలు మాత్రం అంధకారంలోకి వెళ్తున్నాయి. కార్మిక సంఘాలు కూడా కలుషితమైన నీటిపై ఆందోళన వ్యక్తం చేశాయి. అధికారులకు విన్నవించారు. కానీ స్పందన కరువైంది. సింగరేణి ప్రాంత ప్రజలు పోరాటం చేస్తున్నారు. కానీ.. స్వచ్ఛమైన వీటిని అందించడం లేదు.. చాలా మంది అమాయకుల చావులకు.. అధికారులు కారణమవుతున్నారు.. ఇప్పటి కైనా మేల్కొని స్వచ్ఛమైన తాగు నీటిని అందించాలని కోరుతున్నాయి కార్మిక సంఘ నేతలు.