Gas Cylinder Explosion : హైదరాబాద్ పాతబస్తీలోని మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో 13 మంది తీవ్ర గాయపడ్డారు. బాధితులంతా ఒకే ఇంట్లో ఉండటంతో అందరికీ తీవ్రగాయాలయ్యాయి. వీరంతా బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ స్వర్ణకారులుగా పని చేస్తున్నారు. క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు గోల్డ్ వస్తువుల తయారీలో వాడే రసాయనాల వల్ల ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు సంఘటన స్థలానికి చేరుకున్న మీర్ చౌక్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..
మరిన్ని ఇక్కడ చదవండి :
Bankruptcy Law Amendments: దివాలా చట్టానికి పార్లమెంట్ చేసిన సవరణలను సమర్ధించిన సుప్రీం కోర్టు