AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్ మరువని, మన్నించని గాయం! ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఏం జరిగింది?

ఏప్రిల్ 22.. సాధారణంగా ఇది ఒక వేసవి సెలవుల్లో వచ్చే రోజు కావాలి. కానీ, నేడు ప్రతి భారతీయుడి హృదయంలో ఒక మాయని గాయంగా, అదే సమయంలో దేశం చాటిన సత్తాకు ప్రతీకగా నిలిచిపోయింది. సరిగ్గా ఏడాది క్రితం, జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ పచ్చిక బయళ్ళు రక్తసిక్తమయ్యాయి. 26 మంది అమాయక పౌరుల ప్రాణాలను బలిగొన్న ఆ నరమేధం జరిగి నేటికి ఏడాది పూర్తయింది.

భారత్ మరువని, మన్నించని గాయం! ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఏం జరిగింది?
Pahalgam Victims Memorial,
Balaraju Goud
|

Updated on: Apr 22, 2026 | 10:38 AM

Share

ఏప్రిల్ 22.. సాధారణంగా ఇది ఒక వేసవి సెలవుల్లో వచ్చే రోజు కావాలి. కానీ, నేడు ప్రతి భారతీయుడి హృదయంలో ఒక మాయని గాయంగా, అదే సమయంలో దేశం చాటిన సత్తాకు ప్రతీకగా నిలిచిపోయింది. సరిగ్గా ఏడాది క్రితం, జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ పచ్చిక బయళ్ళు రక్తసిక్తమయ్యాయి. 26 మంది అమాయక పౌరుల ప్రాణాలను బలిగొన్న ఆ నరమేధం జరిగి నేటికి ఏడాది పూర్తయింది.

పహల్గామ్‌లో ఏం జరిగింది?

2025, ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్‌లోని బైసారన్ లోయ పర్యాటకులతో కిక్కిరిసి ఉంది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న తరుణంలో, పాకిస్థాన్‌కు చెందిన లష్కర్-ఎ-తైబా (LeT) ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. హిందూ పురుషులను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ విచక్షణారహిత కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 2008 ముంబై దాడుల తర్వాత దేశాన్ని అంతగా కుదిపేసిన ఘటన ఇదే. ఈ వార్త తెలియగానే యావత్ భారతావని దిగ్భ్రాంతికి లోనైంది. దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు మిన్నంటాయి.

నాడు మౌనం.. నేడు వ్యూహం..

గతంలో లాగా కేవలం ఖండనలతో సరిపెట్టకుండా, కేంద్ర ప్రభుత్వం ఈసారి ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అమలు చేసింది. దాడి జరిగిన మరుసటి రోజే దౌత్యపరమైన యుద్ధాన్ని ప్రారంభించింది. పాకిస్థాన్‌తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాటు, సరిహద్దు మార్గాలను పూర్తిగా మూసివేసి పొరుగు దేశాన్ని ఒంటరిని చేసింది. కానీ, అసలైన సమాధానం యుద్ధక్షేత్రంలో సిద్ధమైంది.

ఆపరేషన్ సింధూర్

మే 7వ తేదీన భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ను ప్రారంభించింది. అది కేవలం ప్రతీకారం మాత్రమే కాదు, భారత సాయుధ దళాల శక్తి సామర్థ్యాలకు నిదర్శనం. పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్థాన్ భూభాగంలోని బహవల్పూర్‌లోని జైష్-ఎ-మొహమ్మద్ స్థావరం, మురీద్కేలోని లష్కర్ స్థావరం వంటి 9 ప్రధాన కేంద్రాలపై భారత్ విరుచుకుపడింది. ఈ ఆపరేషన్‌లో యూసుఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రౌఫ్ వంటి కరుడుగట్టిన ఉగ్రవాదులతో సహా 100 మందికి పైగా హతమయ్యారు.

పాక్-భారత్ మధ్య సంఘర్షణ

ఈ దాడుల అనంతరం ఇరు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు తీవ్రమైన సైనిక ఘర్షణ జరిగింది. పాకిస్థాన్.. భారత నగరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. చివరకు కాల్పుల విరమణ జరిగినప్పటికీ, “ఇకపై ఉగ్రవాదానికి సమాధానం ఇలాగే ఉంటుంది” అని భారత్ స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది.

భారతదేశం మర్చిపోదు..

పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది పూర్తైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాధితులను స్మరించుకుంటూ, వారిని ఎన్నటికీ మరచిపోలేమని అన్నారు. భారతదేశం ఏ రూపంలోనైనా ఉగ్రవాదానికి ఎప్పటికీ తలవంచదని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదుల దుష్ట పన్నాగాలు ఎప్పటికీ సఫలం కావు. ఈ విషాద సమయంలో బాధితుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ విషాద ఘటనను గుర్తు చేసుకుంటూ.. భారత సైన్యం సోషల్ మీడియా వేదికగా ఒక పవర్‌ఫుల్ సందేశాన్ని పంచుకుంది. “కొన్ని హద్దులను ఎప్పటికీ దాటకూడదు. భారతదేశం మర్చిపోదు.” అంటూ పేర్కొంది. మానవత్వం హద్దులు దాటినప్పుడు ప్రతిస్పందన ఎంత కఠినంగా ఉంటుందో ఈ సందేశం గుర్తు చేస్తోంది.

పహల్గామ్‌ బాధితులకు ఘన నివాళులు

నేడు పహల్గామ్‌లో బాధితుల స్మారకార్థం నివాళులు అర్పిస్తూనే, దేశం గర్వంగా తలెత్తుకుంటోంది. ఎందుకంటే, ఇది కేవలం సంతాప దినం మాత్రమే కాదు, అన్యాయానికి వ్యతిరేకంగా భారత్ ఐక్యంగా నిలబడి, శత్రువును గడగడలాడించిన పరాక్రమ దినం. అమరవీరుల త్యాగం వృధా పోదని, ఉగ్రవాదానికి ఈ గడ్డపై చోటు లేదని న్యూఢిల్లీ మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Follow Us