మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అదుపుతప్పిన లారీ – బైక్ ఢీ.. దంపతులతో సహా ముగ్గురు మృతి

బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు.

  • Balaraju Goud
  • Publish Date - 9:42 pm, Wed, 20 January 21
మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అదుపుతప్పిన లారీ - బైక్ ఢీ.. దంపతులతో సహా ముగ్గురు మృతి

మంచిర్యాల జిల్లాలో ఘరో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ – బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. కన్నెపల్లి మండలం నాయకినిపేటలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. లారీ అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ప్రాణాలను విడిచారు. ఈ ప్రమాదంలో దంపతులు సహా మరో మహిళ మృతిచెందింది. మృతులను కన్నెపల్లి మండలం ముక్కంపల్లి వాసులుగా గుర్తించారు.

మక్కంపల్లి గ్రామానికి చెందిన బైరి పెరమయ్య (65)కళావతి(55) భార్య భర్తలతో పాటు వదిన మల్లక్క (50) భూమి రిజిస్ట్రేషన్ పనులు ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో కుటుంబసభ్యులు శోక సముద్రం మునిగిపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మ‌ృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోద చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also… స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో కుప్పకూలిన భవనం… ఇద్దరు మ‌ృతి.. పలువురికి గాయాలు..