AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: రాడ్ రంబోలా..! రిలీజ్ రోజే డిజాస్టర్ టాక్.. ఓటీటీలో మాత్రం ఎగబడి చూస్తున్న జనం

ఓటీటీ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్స్ లో విడుదలైన సినిమాలన్నీ ఓటీటీలో విడుదలై మంచి హిట్స్ గా నిలుస్తున్నాయి. థియేటర్స్ లో డిజాస్టర్ అయిన సినిమాలు కూడా ఓటీటీలో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. వాటిలో ఈ సినిమా ఒకటి..

OTT Movie: రాడ్ రంబోలా..! రిలీజ్ రోజే డిజాస్టర్ టాక్.. ఓటీటీలో మాత్రం ఎగబడి చూస్తున్న జనం
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Apr 22, 2026 | 1:02 PM

Share

ప్రస్తుతం ట్రెండ్ మారింది చిన్న బడ్జెట్ సినిమాలతో పాటు పెద్ద సినిమాలు కూడా విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదలవుతున్నాయి. మినిమమ్ మూడు నాలుగు భాషల్లో సినిమాలు విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇదిలా ఉంటే కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలై ఊహించని విధంగా ప్రేక్షకులను నిరాశపరిస్తు ఉంటాయి. భారీ బడ్జెట్ తో పాటు స్టార్ హీరోలు, హీరోయిన్స్ నటించినా కూడా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతూ ఉంటాయి. అలాగే చిన్న సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పెద్ద హిట్ అవుతూ  ఉంటాయి. ఓ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. భారీ బడ్జెట్ , స్టార్ కాస్ట్ ఉన్నా కూడా ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.

ఇది కూడా చదవండి :  Pokiri: ఎన్నాళ్లకు కనిపించింది మావ..! పోకిరి రౌడీ గర్ల్ ఎంత మారిపోయింది..!!

కానీ ఓటీటీలో మాత్రం పెద్ద హిట్ అయ్యింది.. ఓటీటీలో ఎగబడి మరీ ఆ సినిమా చూశారు జనాలు.. ఆ సినిమా మరేదో కాదు.. బాలీవుడ్ లో తెరకెక్కిన థగ్స్ ఆఫ్ హిందూస్తాన్. అమీర్ ఖాన్ నటించిన ఈ చిత్రం బాలీవుడ్‌లో అతిపెద్ద డిజాస్టర్ మూవీస్ లో ఒకటి. 2018లో విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ డే నుంచే డిజాస్టర్ అనే టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో VFX, గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. కానీ కథలో బలం లేకపోవడంతో ఈ సినిమా ప్లాప్ అయ్యింది.

ఇది కూడా చదవండి : తెలుగులో తిరుగులేని హీరోయిన్.. పగబట్టి కెరీర్ నాశనం చేసిన హీరో.. చనిపోయాక శవాన్ని కూడా వదల్లేదు..

చిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించారు. 310 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. దేశవ్యాప్తంగా కేవలం రూ.151.30 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమాలో హీరోయిన్స్ గా కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ నటించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమా థియేటర్స్ లో డిజాస్టర్ అయినా ఓటీటీలో మాత్రం మంచి హిట్ గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: జబర్దస్త్‌లో 180 ఎపిసోడ్స్ చేశా.. ఇప్పుడు అవకాశాలు లేవు.. ఏం చేయాలో తెలియక ఇప్పుడు ఇలా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రైలు పట్టాలపై సోలార్ ప్యానెల్స్.. ఖాళీ స్థలంతోనే కోట్లాది యూనిట్ల
రైలు పట్టాలపై సోలార్ ప్యానెల్స్.. ఖాళీ స్థలంతోనే కోట్లాది యూనిట్ల
‘లివింగ్ రిలేషన్ కోసం నన్ను సంప్రదించండి’.. ఫోన్ నంబర్ ఇదే!
‘లివింగ్ రిలేషన్ కోసం నన్ను సంప్రదించండి’.. ఫోన్ నంబర్ ఇదే!
మహేష్ ఆ క్యారెక్టర్ వేస్తే చాలా స్టైలీష్‏గా ఉంటాడు..
మహేష్ ఆ క్యారెక్టర్ వేస్తే చాలా స్టైలీష్‏గా ఉంటాడు..
ఘోర విషాదం.. ల్యాండ్ అవుతూ పేలిపోయిన విమానం!
ఘోర విషాదం.. ల్యాండ్ అవుతూ పేలిపోయిన విమానం!
ఇండియా జనబంధన్ అత్యవసర భేటీ..వన్‌-టు-వన్‌ ఫార్ములాతో దీదీ ప్లాన్!
ఇండియా జనబంధన్ అత్యవసర భేటీ..వన్‌-టు-వన్‌ ఫార్ములాతో దీదీ ప్లాన్!
ఏపీ రోడ్లపై రోడ్ డాక్టర్ మ్యాజిక్.. గంటలోనే గుంత మాయం..
ఏపీ రోడ్లపై రోడ్ డాక్టర్ మ్యాజిక్.. గంటలోనే గుంత మాయం..
అసలు చేపలకు, మృగశిరకు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
అసలు చేపలకు, మృగశిరకు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ఎల్ నినో గుప్పిట్లో హైదరాబాద్, ఢిల్లీ.. రాబోయే 3 నెలలు కష్టమే..?
ఎల్ నినో గుప్పిట్లో హైదరాబాద్, ఢిల్లీ.. రాబోయే 3 నెలలు కష్టమే..?
నీట్ రీఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయిందా..? ఎన్‌టీఏ బిగ్ క్లారిటీ..
నీట్ రీఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయిందా..? ఎన్‌టీఏ బిగ్ క్లారిటీ..
ఇంజనీరింగ్ కన్సల్టెంట్.. ఇప్పుడు స్టార్ హీరో..
ఇంజనీరింగ్ కన్సల్టెంట్.. ఇప్పుడు స్టార్ హీరో..