స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో కుప్పకూలిన భవనం… ఇద్దరు మ‌ృతి.. పలువురికి గాయాలు..

మాడ్రిడ్‌లోని ఓ భవనంలో బుధవారం గ్యాస్‌ లీక్ పేలినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సిలిండర్‌ పేలడంతో భవనం ధ్వంసమైంది.

స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో కుప్పకూలిన భవనం... ఇద్దరు మ‌ృతి.. పలువురికి గాయాలు..
Follow us

|

Updated on: Jan 20, 2021 | 9:27 PM

స్పెయిన్ దేశ రాజధాని మాడ్రిడ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ పేలి భవనం ధ్వంసమైంది. స్థానిక అధికారుల కథనం ప్రకారం… మాడ్రిడ్‌లోని ఓ భవనంలో బుధవారం గ్యాస్‌ లీక్ పేలినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సిలిండర్‌ పేలడంతో భవనం ధ్వంసమైంది. ఎలక్ట్రానిక్‌ పరికరాలతోపాటూ ఫర్నిచర్‌ కాలిపోయాయి. ఈ పేలుళ్ల ధాటికి దట్టంగా దుమ్ము ధూళి ఎగిసిపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు మ‌ృతి చెందగా, చాలా మంది గాయపడినట్లు నగర అత్యవసర విభాగం అధికారవర్గాలు తెలిపాయి.

మాడ్రిడ్ మధ్యలో టోలెడో వీధిలో సంభవించిన ఈ పేలుడు విస్తృతంగా నష్టాన్ని కలిగించిందని అత్యవసర సేవలు ఎమర్జెన్సియాస్ మాడ్రిడ్ తెలిపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయ చర్యలు చేపట్టారు. అయితే, ఎంత మంది గాయపడ్డారో తాను ధృవీకరించలేనని చెప్పాడు.

Read Also… రైతు చర్చల్లో పురోగతి.. వ్యవసాయ చట్టాలపై రైతులముందు కొత్త ప్రతిపాదన.. సమస్య పరిష్కారానికి మరో కమిటీ