AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: లక్షల్లో జీతం వస్తున్నా ఇదేం కక్కుర్తి సార్.. లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఆర్డీవో

ఉన్నత స్థానాల్లో ఉండే కొందరు అధికారులు కాసులకు కక్కుర్తి పడి తమ వృత్తికే ద్రోహం చేస్తున్నారు. డబ్బు మీద ఉన్న మోజుతో ప్రజలను నిలువునా దోచుకుంటూ అధికారిన్ని దుర్వినియోగం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి బర్త్‌ సర్టిఫికెన్ జారీ చేసేందుకు ఓ ఆర్డీవో రూ.25 వేలు లంచం తీసుకుంటూ అడ్డగా ఏసీబీకి బుక్కయ్యాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Telangana: లక్షల్లో జీతం వస్తున్నా ఇదేం కక్కుర్తి సార్.. లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఆర్డీవో
Narayanpet Rdo Arrested
Anand T
|

Updated on: Apr 22, 2026 | 1:08 PM

Share

బర్త్‌ సర్టిఫికెట్‌లు జారీ చేసేందుకు రూ.25వేల లంచం తీసుకుంటూ నారాయణపేట ఆర్డీఓ రాంచందర్‌ నాయక్ ఏసీబీకి పట్టుబడ్డాడు. మంగళవారం తన కార్యాలయంలోనే నేరుగా రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కారు. మహబూబ్‌నగర్‌ రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం ప్రకారం.. ఊట్కూర్‌ మండలానికి చెందిన ఓ వ్యక్తి తనతో పాటు తన స్నేహితులకు సంబంధించి బర్డ్ సర్టిఫికెట్స్ కోసం గతేడాది జులైలో మీసేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అయితే వాటిని ఊట్కూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయానికి పంపించారు. వాటిని అక్కడే కలెక్ట్ చేసుకోవాలని సూచించారు.

అయితే దరఖాస్తు చేసిన వ్యక్తి.. తన బర్త్‌ సర్టిఫికెట్ కోసం అప్పటి నుంచి ఆర్డీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అయితే ఈ సర్టిఫికెట్స్ ఇవ్వాలంటే ఒక్కో జనన ధ్రువీకరణ పత్రానికి రూ. 7500 చొప్పున లంచం ఇవ్వాలని ఆర్డీవో రామచందర్ నాయక్ డిమాండ్ చేసినట్టు బాధితుడు ఆరోపించాడు. చివరకు ఎలాగోలా రూ. 5వేల చొప్పున రూ. 25 వేలు చెల్లించాలని తనతో ఆర్డీఓ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. అలాగే తాను ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

అయితే ఆర్డీవో బండారం బయటపెట్టేందుకు ఏసీబీ అధికారులు బాధితుడితో కలిసి ప్లాన్ వేశారు. అధికారుల సూచన మేరకు బాధితుడు మంగళవారం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ రాంచందర్‌ను కలిసి రూ.25 వేలు లంచం ఇచ్చాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఎంట్రీ ఇచ్చిన ఏసీబీ అధికారులు ఆర్డీవోను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే నారాయణపేట జిల్లా కేంద్రం బాబాకాలనీలోని ఆయన నివాసంలో సైతం అధికారులు తనిఖీలు చేపట్టారు. నిందితుడిని అరె‌స్టచేసి హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..