AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGSRTC: చర్చలు విఫలం.. నేటి అర్థరాత్రి నుంచి బస్సులు బంద్

తెలంగాణ ప్రభుత్వంతో టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ చర్చలు విఫలం అయ్యాయి. దీంతో ఈ రోజు అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు జేఏసీ పిలుపునిచ్చింది. తమ డిమాండ్లను నెరవేర్చాలని కార్మికులు ఎప్పటినుంచో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, గత నెలలో సమ్మె నోటీసులు ఇచ్చినా స్పందన రాలేదు.

TGSRTC: చర్చలు విఫలం.. నేటి అర్థరాత్రి నుంచి బస్సులు బంద్
Tgsrtc
Venkatrao Lella
|

Updated on: Apr 21, 2026 | 9:38 PM

Share

టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ నేతలతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో ఇవాళ అర్థరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడనున్నారు. బుధవారం ఉదయం షిఫ్ట్ నుంచే కార్మికులు విధులు బహిష్కరించనున్నారు. దీంతో అర్ధరాత్రి నుంచి బస్సులు పూర్తిగా నిలిచిపోనున్నాయి. వేతన సవరణ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం,  రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ఆ హామీని నిలబెట్టకోలేదు. అలాగే వేతన సవరణ, ఇతర ప్రయోజనాలు కల్పించాలని కార్మికులు కోరుతున్నారు.

అయితే ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలు పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. సమస్య పరిష్కారానికి నాలుగు వారాల గుడువు ఇవ్వాలని కమిటీ సూచించింది. కానీ కమిటీ ప్రతిపాదనలను జేఏసీ ఒప్పకోలేదు. దీంతో సమ్మె అనివార్యమైందని చెప్పవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా రోజూ లక్షలాది మంది ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇక ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ద్వారా మహిళలు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు ఆ సేవలు అన్నీ నిలిచిపోనుండటంతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించనుంది.

అయితే సమ్మెపై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమ్మె పరిష్కారం, ప్రయాణికులకు ఇబ్బందులు కలగవద్దనే ఆలోచనతో ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ పై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలు పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆర్టీసీ ప్రతినిధులంతా కమిటీకి మీ అంశాలు విన్నవిస్తే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తాను ప్రభుత్వం దగ్గర కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని సమస్యలు పరిష్కారం చేస్తామని స్పష్టం చేశారు. “ఈ బస్సు ప్రయాణం పేదవాళ్ళకి లైఫ్ లైన్.. ఉద్యోగులుగా మీరు, ప్రభుత్వంగా మేము కలిసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత ఉంది. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ,ఉద్యోగుల సంక్షేమం ప్రయాణికుల సౌలభ్యం చూస్తాం.. ఎలాంటి బెషజాలలకు పోకుండా అధికారుల కమిటీకి మీ సమస్యలు విన్నవించండి.. ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది” అంటూ పొన్నం పేర్కొన్నారు.

Follow Us
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!