AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు బిగ్‌ రిలీఫ్.. హైకోర్టు ఏం చెప్పిందంటే?

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌కు భారీ ఊరట కల్పించింది. ఈ కేసులో ఘోష్‌ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. సెక్షన్ 8 కింద నోటీస్ ఇవ్వకుండా..ఆరోపణలు చేయడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది.

Telangana: కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు బిగ్‌ రిలీఫ్.. హైకోర్టు ఏం చెప్పిందంటే?
Hc Stays Action Against Kcr In Kaleshwaram Project Probe
Anand T
|

Updated on: Apr 22, 2026 | 11:15 AM

Share

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసు వ్యవహరంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోద్దని హైకోర్టు తేల్చి చెప్పింది. అలాగే కేసీఆర్‌తో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి హరీష్‌రావు, స్మిత సభర్వాల్, SK జోషిలకు కూడా ఊరట అభించింది.

అయితే తాజాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసు విషయంలో జరిగిన విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాళేశ్వరం అవతవకల విషయంలో నిగ్గుతేల్చేందుకు కమిషన్‌ ఏర్పాటును హైకోర్టు సమర్థించినప్పటికీ, పీసీ ఘోష్‌ కమిషన్‌ చట్టబద్ధమే అయినప్పటికీ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు హైకోర్టు స్పష్టం చేసింది. సెక్షన్ 8 కింద నోటీస్ ఇవ్వకుండా..ఆరోపణలు చేయడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఘోష్ కమిషన్ నివేధిక ఆధారంగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలిపింది.

అసలు ఏంటి ఈ కేసు

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీ-డిజైన్ చేసి భారీ ఎత్తన లిఫ్ట్‌ ఇరిగేషన్‌గా కాలేశ్వరం ప్రాజెక్టుగా నిర్మించారు. ఇందులో భాగంగానే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద మూడు ప్రధాన బ్యారేజీలను ఏర్పాటు చేశారు. అయితే సుమారు వందల కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో కొన్ని రోజులకే మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పగుళ్లు రావడంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA విచారణ జరిపి, ప్రాజెక్టు డిజైన్, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని తేల్చింది.

దీంతో 2023లో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఒక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే దీనిపై విచారణ జరిపిన కమిషన్ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో నిపుణుల సహాలు లేకుంగా కేసీఆర్ తన సొంత నిర్ణయాలు తీసుకున్నారని.. అలాగే ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరగడం, క్వాలిటీ కంట్రోల్ లోపించడం జరిగిందని ఘోష్ కమిటీ నివేదిక ఇచ్చింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆస్ట్రేలియాలో కాబట్టే మూసుకున్నారు.. అదే భారత్‌లో జరిగితే
ఆస్ట్రేలియాలో కాబట్టే మూసుకున్నారు.. అదే భారత్‌లో జరిగితే
తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. పోటీలు నిర్వహించే నగరాలు ఇవే
తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. పోటీలు నిర్వహించే నగరాలు ఇవే
ఓటీటీలో సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలో సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ట్రంప్‌ వర్సెస్‌ ఓటు.. అమెరికా ఎన్నికల్లో అసలు ఫైట్‌ ఇదే..
ట్రంప్‌ వర్సెస్‌ ఓటు.. అమెరికా ఎన్నికల్లో అసలు ఫైట్‌ ఇదే..
54 బంతుల్లో మ్యాచ్ క్లోజ్.. 2 బంతుల్లోనే ఛేజింగ్..
54 బంతుల్లో మ్యాచ్ క్లోజ్.. 2 బంతుల్లోనే ఛేజింగ్..
భారత రైల్వే నె‌ట్‌వర్క్ అభివృద్ధిపై కేంద్రం ఫోకస్..
భారత రైల్వే నె‌ట్‌వర్క్ అభివృద్ధిపై కేంద్రం ఫోకస్..
దేశంలో ఉద్యోగ కల్పన, నిరుద్యోగంపై ఫ్యాక్ట్ చెక్‌లో కీలక విషయాలు
దేశంలో ఉద్యోగ కల్పన, నిరుద్యోగంపై ఫ్యాక్ట్ చెక్‌లో కీలక విషయాలు
చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహారాలు ముట్టొద్దు..
చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహారాలు ముట్టొద్దు..
మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం
మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు