Telangana BJP President: భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఇటీవల తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి జీ. కిషన్ రెడ్డిని ప్రకటించింది. అయితే, తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం అయిన నాటి నుంచి కిషన్ రెడ్డి ఇప్పటివరకు ఆ పదవికి సంబంధించిన బాధ్యతలు తీసుకోలేదు. బీజేపీ తెలంగాణ పార్టీ కార్యాలయంలో ఉండే అధ్యక్షుడి ఛాంబర్ లో ఇప్పటివరకు ఆయన అడుగు పెట్టలేదు. అయితే ఇప్పటివరకు విదేశీ పర్యటనలో ఉన్న కిషన్ రెడ్డి.. ఢిల్లీ చేరుకున్నారు. ఆయన నియామకం నాటినుంచి కిషన్ రెడ్డి ఎప్పుడూ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు.
అయితే, మొన్నటి వరకు ఆషాఢం కారణంగా బాధ్యతలు తీసుకొని కిషన్ రెడ్డికి ఎట్టకేలకు ఒక మంచి ముహూర్తం లభించింది. ఈనెల 21వ తారీఖు, ఉదయం 10 :30 నిమిషాలకు కిషన్ రెడ్డి అధ్యక్షుడు తన ఛాంబర్లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రాబోతున్నారు.
మొత్తానికి గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న బిజెపికి కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్యక్రమాలు ఊపందుకుంటాయని.. పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ.. పార్టీలో ఆసక్తికరంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..