Telangana Election: కాంగ్రెస్‌ పార్టీ నుంచి కాబోయే ముఖ్యమంత్రి అతనే.. క్లారిటీ ఇచ్చేసిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ

ఏ పార్టీలో అయినా ఎమ్మెల్యేస్థాయి నాయకులు బోలెడు మంది ఉంటారేమో గానీ సీఎం రేసులో మాత్రం ఒకరిద్దరే కనిపిస్తారు. కానీ కాంగ్రెస్‌ లెక్కవేరు. పార్టీలో ఛాన్స్ వస్తే ప్రతీ కార్యకర్త ముఖ్యమంత్రినే. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరో.. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, నిజామాబాద్ అర్భన్ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్‌ షబ్బీర్ అలీ తేల్చేశారు.

Telangana Election: కాంగ్రెస్‌ పార్టీ నుంచి కాబోయే ముఖ్యమంత్రి అతనే.. క్లారిటీ ఇచ్చేసిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ
Shabbir Ali On Revanth
Follow us

|

Updated on: Nov 15, 2023 | 9:10 AM

ఏ పార్టీలో అయినా ఎమ్మెల్యేస్థాయి నాయకులు బోలెడు మంది ఉంటారేమో గానీ సీఎం రేసులో మాత్రం ఒకరిద్దరే కనిపిస్తారు. కానీ కాంగ్రెస్‌ లెక్కవేరు. పార్టీలో ఛాన్స్ వస్తే ప్రతీ కార్యకర్త ముఖ్యమంత్రినే.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరో.. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, నిజామాబాద్ అర్భన్ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్‌ షబ్బీర్ అలీ తేల్చేశారు. తమ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాబోయే సీఎం అంటూ షబ్బీర్ అలీ కుండ బద్దలు కొట్టారు. కామారెడ్డి నియోజకవర్గం మాచారెడ్డి మండలం రెడ్డిపేటలో కాంగ్రెస్ పార్టీ తరుఫున చేపట్టిన ఎన్నికల ప్రచార రోడ్డు షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ సీఎం అభ్యర్థిపై కామెంట్ చేయడం సంచలనంగా మారింది.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డినే కాబోయే ముఖ్యమంత్రి అని, కామారెడ్డిలో ఆయనను గెలిపించాలని షబ్బీర్ అలీ పిలుపునిచ్చారు. ‘షబ్బీర్ కామారెడ్డి విడిచి ఎక్కడికీ పోలేదని, మీ గుండెల్లో ఉన్నానంటూ సెంటిమెంట్ పలికించారు. తెలంగాణ ప్రజల మేలు కోసం రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని, ఆయనన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. షబ్బీర్ అలీ వ్యాఖ్యలు కాంగ్రెస్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఇదిలావుంటే, కామారెడ్డి నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్‌తో పాటు ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండటంతో రేవంత్ కొడంగల్‌తో పాటు కామారెడ్డిలో కూడా బరిలో నిలిచారు.

సీఎం క్యాండిడేట్‌గా ఎప్పుడూ ఒక్కరే కనపడడం మంచిదా, ఒకరు కాకపోతే ఇంకొకరు ఉన్నారనే ఆప్షన్ ఉండడం బెటరా? ఏమో.. దీనికి సమాధానం ఎవరూ చెప్పలేరు. కాకపోతే, సీఎం కుర్చీ కోసం కొట్లాటలు, ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకోకుండా ఉంటే చాలనేది మెజారిటీ వర్షన్. ఒకవేళ ముఖ్యమంత్రి స్థానం కోసం కొట్టుకుంటున్నారని తెలిస్తే మాత్రం అంతకంటే నెగటివ్ ఇంకోటి ఉండదు. కానీ, కాంగ్రెస్‌ అడుగులు, నేతల మాటలు అలాగే ఉన్నాయన్న విమర్శ వినిపిస్తోంది. మీడియా అడిగినప్పుడేమో.. సీఎం ఎవరన్నది గెలిచిన తరువాత హైకమాండ్‌ నిర్ణయిస్తుంది అని చెబుతున్నారు. నియోజకవర్గాలకు వెళ్లినప్పుడేమో.. ‘నేనే గెలుస్తా.. సీఎం నేనే అవుతా’ అంటున్నారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ నేతల నుంచి ఇవే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ నుంచి కనీసం అరడజను మంది సీఎం రేసులో ఉన్నారనేది నిజం. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. వీళ్లంతా సీఎం పదవి విషయంలో అడపా దడపా నోరు మెదుపుతూనే ఉన్నారు. కాగా.. ఇప్పుడు షబ్బీర్ అలీ చేసిన వాఖ్యల పట్ల.. కాంగ్రెస్ పార్టీలోని మిగతా సీఎం అభ్యర్థులు ఎలా స్పందిస్తారన్నదీ ఆసక్తికరంగా మారింది. అయితే.. ప్రత్యర్థి పార్టీలకు ఎప్పుడు ఎదో ఒక అవకాశమిచ్చే కాంగ్రెస్.. తాజాగా ఇలా సీఎం అభ్యర్థి విషయంలో వాళ్లలో వాళ్లే ప్రకటించుకుంటూ విమర్శనాస్త్రాన్ని ఇచ్చినట్టయింది. మరోసారి సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పేరు బహిర్గతం కావడం.. పార్టీలో అంతర్గతంగా భేదాబిప్రాయాలు బయటపడి, వాళ్ళల్లో వాళ్లే తగవులాడుకుంటారని ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నారు.

మొత్తానికి కాంగ్రెస్ తరపున సీఎం అభ్యర్ధులు అరడజను మంది ఉన్నారు. ఇదే ఇతర పార్టీలకు ఆయుధంగా మారింది. మీ పార్టీలో సీఎం అభ్యర్ధి ఎవరో చెప్పండని టార్గెట్ చేస్తున్నారు. ఈ టాపిక్‌ను వీలైనంత వరకు డార్క్‌సైడ్‌న ఉంచాల్సిన కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా.. తానే సీఎం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదైతేనేం.. కాంగ్రెస్ నుంచి సీఎం ఎవరు అనేది ఇకపై ప్రధాన ప్రచారాస్త్రం కాకుండా చూసుకోవడమే ఆ పార్టీ ముందున్న టార్గెట్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ఈ విలన్ ఆఖరి రోజుల్లో ఎంత నరకం అనుభవించారో..
ఈ విలన్ ఆఖరి రోజుల్లో ఎంత నరకం అనుభవించారో..
కలెక్టర్ అంటే ఇలా ఉండాలి.! చాక్ పీస్ పట్టి.. లెక్కల మాస్టర్‌గా..
కలెక్టర్ అంటే ఇలా ఉండాలి.! చాక్ పీస్ పట్టి.. లెక్కల మాస్టర్‌గా..
కాలుష్యంతో ఉత్తరాది ఉక్కిరిబిక్కిరి.. నురగలు కక్కుతున్న యుమునా!
కాలుష్యంతో ఉత్తరాది ఉక్కిరిబిక్కిరి.. నురగలు కక్కుతున్న యుమునా!
డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డారో తప్పదు పాకీజా పని..!బీఅలర్ట్
డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డారో తప్పదు పాకీజా పని..!బీఅలర్ట్
మృత్యు వారదులుగా మారుతోన్న ధాన్యపు రాశులు..
మృత్యు వారదులుగా మారుతోన్న ధాన్యపు రాశులు..
సినీ ప్రపంచంలో అతి పెద్ద సామ్రాజ్యం.. కమల్ ఆస్తులు తెలిస్తే.
సినీ ప్రపంచంలో అతి పెద్ద సామ్రాజ్యం.. కమల్ ఆస్తులు తెలిస్తే.
దూకుడును మరింత పెంచేందుకు గులాబీ బాస్ కసరత్తు..
దూకుడును మరింత పెంచేందుకు గులాబీ బాస్ కసరత్తు..
క్షీణిస్తోన్న సునీతా విలియమ్స్‌ ఆరోగ్యం? ఆందోళన కలిగిస్తోన్న ఫొటో
క్షీణిస్తోన్న సునీతా విలియమ్స్‌ ఆరోగ్యం? ఆందోళన కలిగిస్తోన్న ఫొటో
వామ్మో.. 18 వేల నకిలీ కంపెనీలు.. రూ.25 వేల కోట్ల పన్ను ఎగవేత!
వామ్మో.. 18 వేల నకిలీ కంపెనీలు.. రూ.25 వేల కోట్ల పన్ను ఎగవేత!
షారుఖ్ ఖాన్ ను చంపేస్తాం.. ముంబై పోలీసులకు మళ్లీ బెదిరింపు కాల్స్
షారుఖ్ ఖాన్ ను చంపేస్తాం.. ముంబై పోలీసులకు మళ్లీ బెదిరింపు కాల్స్