AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harish Rao: నిజమేంటో ప్రజలకు తెలియాలి.. ప్రాజెక్ట్‌లపై విచారణకు మేం సిద్ధం.. హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరగుతున్నాయి. శ్వేతపత్రాలపై అటు కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇటు బీఆర్ఎస్ మధ్య రగడ కొనసాగుతోంది. ఈ క్రమంలో అసెంబ్లీ మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు.. ప్రాజెక్ట్‌లపై విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. ఈ అంశంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Harish Rao: నిజమేంటో ప్రజలకు తెలియాలి.. ప్రాజెక్ట్‌లపై విచారణకు మేం సిద్ధం.. హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు..
Harish Rao
Shaik Madar Saheb
|

Updated on: Dec 20, 2023 | 3:55 PM

Share

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరగుతున్నాయి. శ్వేతపత్రాలపై అటు కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇటు బీఆర్ఎస్ మధ్య రగడ కొనసాగుతోంది. ఈ క్రమంలో అసెంబ్లీ మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు.. ప్రాజెక్ట్‌లపై విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. ఈ అంశంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం, మేడిగడ్డ విషయంలోనూ కాంగ్రెస్‌ నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నిజమేంటో ప్రజలకు తెలియాలని హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందంటూ విమర్శించారు. ఈ శ్వేతపత్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వ్యయం- తెలంగాణ వాటా కింద 1956-57 నుంచి 2013-14 వరకు 41.68 శాతం ఖర్చు చేసినట్లు గంపగుత్త లెక్క తీశారంటూ పేర్కొన్నారు. కావాలంటే దీనిపై హౌస్‌ కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు. మొత్తం లెక్కలు తీసి.. నిజానికి ఎంత ఖర్చయ్యిందో చూపించడానికి సిద్ధంగా ఉన్నామని హరీష్ రావు వివరించారు.

ముందుగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. కాళేశ్వరం అద్భుతం అని చెప్పుకుంటున్నారంటూ విమర్శించారు. కాళేశ్వరం పూర్తి అంచనాలు ఇవ్వాలని.. ఆర్థికశాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. తొమ్మిదిన్నరేళ్లుగా సాగునీటిశాఖ.. కేసీఆర్‌ కుటుంబం ఆధీనంలో ఉందని.. కార్పొరేషన్ల అప్పులకు సంతకాలు పెట్టింది ఎవరంటూ ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు.. అప్పులను ఆదాయంగా చూపించారని కాగ్‌ చెప్పినట్లు వివరించారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా